ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ అమలుపై ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది, రెండోది ఓపెన్ అయింది, మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా అని లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలే వారి కుర్చీలు మడతపెట్టారని ఎద్దేవా చేసారు.
బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2నిమిషాల పని అని అన్నారు లోకేష్. చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? అని ప్రశ్నించారు. ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉందని లోకేష్ స్పష్టం చేసారు. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలుచేస్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. నేను తగ్గేదే లేదు, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్ ది అన్నారు లోకేష్.