JANASENA: నియోజకవర్గాల ఇంచార్జిల మార్పు వ్యవహారం వైసీపీలో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. టికెట్ దక్కని నేతలు ఎవరికి వారు.. తమ దారులు వెతుక్కుంటున్నారు. టికెట్ హామీతో జంపింగ్ జపాంగ్ అంటున్నారు. జగన్ నుంచి ప్రకటన వచ్చాక జంప్ చేస్తున్న నేతలు కొందరు అయితే.. ముందే జంప్ చేద్దాం అనుకునేవాళ్లు ఇంకొందరు. ఇలాంటి పరిణామాల మధ్య.. వైసీపీకి మరో భారీ షాక్ తప్పదా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. మరో సిట్టింగ్ ఎంపీ.. ఫ్యాన్‌కు హ్యాండిచ్చి పవర్ స్టార్ చెంతకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం ఏపీ రాజకీయాలను షేర్ చేస్తోంది.
TDP-JANASENA: ఎందుకు ఆగారంటే..! సర్దుబాటు ఎందుకు ఆగింది..?
మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి.. జనసేనలో చేరికకు రంగం దాదాపుగా సిద్ధం అయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు నెలల నుంచి జనసేన నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారని సమాచారం. ఐతే లోక్‌సభ నియోజకవర్గాల ఇంచార్జిలను మారుస్తున్న జగన్.. ఈసారి బాలశౌరికి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం ముందే గ్రహించిన బాలశౌరి.. ముందే పార్టీ మారిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో జనసేన అధినేత పవన్‌ను కలవనున్నారని.. అన్ని రకాల హామీలు తీసుకున్న తర్వాత.. జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మచిలీపట్నం ఎంపీ స్థానం లేదా అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు జనసేన కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక అటు బాలశౌరి రాక పార్టీకి కూడా భారీగా లాభం చేస్తుందని.. జనసేన పెద్దలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలశౌరి కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన పార్టీలో చేరితే.. బలం మరింత పెరుగుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికే వరుస జంపింగ్స్‌తో అల్లాడుతున్న వైసీపీకి.. ఇప్పుడు బాలశౌరి కూడా పార్టీ మారితే.. కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయం. వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరు ఉన్న బాలశౌరి.. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతో నడుస్తున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బాలశౌరి.. తెనాలి లోక్‌సభ స్థానం నుంచి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో నరసరావుపేట లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైసీపీలో చేరిన ఆయన.. 2014లో గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున విజయం సాధించారు.