హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా మరోసారి స్పీడ్ పెంచింది. అక్రమ కట్టడాల సమాచారం వస్తే కూల్చివేతలకు రంగం సిద్దం చేస్తోంది. కీలక ప్రాంతాల్లో హైడ్రా అధికారులు భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కొంత గ్యాప్ ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్ళీ చర్యలకు దిగారు. ఈ క్రమంలో కొందరి నుంచి హైడ్రాకు వ్యతిరేకత వస్తోంది. వ్యతిరేకించే వారిపై కూడా చర్యలకు హైడ్రా సిద్దమైంది.
సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేతలను హైడ్రా అధికారులు చేపట్టారు. ఎఫ్టీఎల్,బఫర్ జోన్ లలో నిర్మాణాలను కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు కొందరు. దీనితో తమ విధులకు ఆటంకం కలిగించిన వారిపై మాదాపూర్ పోలీసులకు హైడ్రా సిబ్బంది ఫిర్యాదు చేసారు. వెంకటేష్, లక్ష్మీ, సురేష్ అనే ముగ్గురిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు.