Malla Reddy: కాంగ్రెస్ గెలుస్తుందనుకోలేదు.. సీఎం రేవంత్‌ను కలుస్తా: మల్లారెడ్డి

56 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఏం చేసింది. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 09:16 PM IST

Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కలలో కూడా ఊహించలేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుందని విమర్శించారు. శనివారం జరిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. “పద్దెనిమిది యేళ్ళు పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకొన్నాం.

T CONGRESS: కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం పెరిగిన డిమాండ్.. 17 స్థానాలకు 250 మంది దరఖాస్తు..

తాగునీటి సాగునీరు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్. దేశానికి అన్నం పెట్టే రైతన్నను తయారు చేసిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వలసలు వెళ్ళిన తెలంగాణ ప్రజలు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 15 రాష్ట్రాల నుంచి వలస వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌ది. 56 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఏం చేసింది. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తా. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే తప్పేంటి..? గతంలో ఇద్దరం టీడీపీలో కలిసి పని చేశాం.

రాజకీయ చర్చకు తావులేకుండా.. సీఎంను కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తా. మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలని మా పార్టీ నేతలు అడిగారు. నా కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరా. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం ఉంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుతాం” అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.