MALLAREDDY: డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ.. రేవంత్‌ అంటే భయం తగ్గలేదా..?

కూల్చివేత జరుగుతుండగానే పరుగు పరుగున అల్లుడితో కలిసి వెళ్లి.. ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఆ తర్వాత కేసీఆర్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అక్కడే అసలు ట్విస్ట్ కనిపించింది.

  • Written By:
  • Updated On - March 14, 2024 / 07:57 PM IST

MALLAREDDY: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారంలో రేవంత్ సర్కార్‌ కఠినంగా కనిపిస్తోంది. ఇప్పటికే మల్లన్న మీద పలు పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జా కేసులు నమోదుకాగా.. అక్రమ కట్టడాల విషయంలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. బిల్డింగ్‌లు కూల్చేశారు. ఐతే కూల్చివేత జరుగుతుండగానే పరుగు పరుగున అల్లుడితో కలిసి వెళ్లి.. ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు మల్లారెడ్డి.

GVL Narasimha Rao: హడావిడి మాస్టర్.. GVL ఎక్కడ..?

ఆ తర్వాత కేసీఆర్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అక్కడే అసలు ట్విస్ట్ కనిపించింది. అప్పటివరకు మల్కాజ్‌గిరి టికెట్ తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టిన మల్లారెడ్డి.. ఆ తర్వాత పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. రేవంత్‌ సర్కార్‌ మీద భయంతోనే.. మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది. ఐతే ఆ భయం ఇంకా తగ్గలేదా.. మరింత టెన్షన్ మొదలైందా అనే డిస్కషన్ జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్‌తో ఢిల్లీలో కొడుకుతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్‌ అంటే మల్లారెడ్డికి భయం తగ్గలేదని.. అందుకే కాంగ్రెస్ పెద్దలను కూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో రకరకాల చర్చ మొదలైంది.

ఆ మధ్య తొడగొట్టి మరీ రేవంత్‌కు మల్లారెడ్డి సవాల్ విసిరిన వీడియోను.. ఇప్పుడు నెటిజన్లు మళ్లీ షేర్‌ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ సిట్టింగ్ స్థానం కావడంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలవాలని పట్టు మీద కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకుతో కలిసి డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.