MALLAREDDY: రేవంత్‌ దెబ్బ.. మల్లన్న అబ్బ.. చేతులెత్తేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

సీఎం దెబ్బకు.. మల్లారెడ్డి చేతులెత్తేశారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కొడుకును బరిలో దించాలని ప్లాన్ చేసిన మల్లన్న.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు సందేశం పంపారు. ఈ నిర్ణయం వెనక.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేతల ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 8, 2024 / 03:32 PM IST

MALLAREDDY: మాజీ మంత్రి మల్లారెడ్డి టైమ్ అసలు బాలేదు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి.. వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. భూ కబ్జా కేసులు, కూల్చివేతలు, రోడ్ల తొలగింపులు.. వీటితో మల్లారెడ్డికి నిద్రలేకుండా చేస్తోంది రేవంత్‌ సర్కార్. సీఎం దెబ్బకు.. మల్లారెడ్డి చేతులెత్తేశారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కొడుకును బరిలో దించాలని ప్లాన్ చేసిన మల్లన్న.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు సందేశం పంపారు. ఈ నిర్ణయం వెనక.. మల్లారెడ్డి అల్లుడి కాలేజీ బిల్డింగ్‌ల కూల్చివేతల ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది.

TONIQUE LIQUOR CASE: సంతోషా ఏంటి అరాచకం.. టానిక్ కేసులో అడ్డంగా దొరికేశాడుగా..!

కేసీఆర్‌, కేటీఆర్‌తో భేటీ అయిన మల్లారెడ్డి.. మల్కాజ్‌గిరి ఎంపీగా తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేసే చాన్స్ లేదని క్లియర్‌గా చెప్పేసినట్లు తెలుస్తోంది. ఐతే భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని.. ఇప్పటివరకు మల్లారెడ్డి డిమాండ్‌ చేస్తూ వచ్చారు. పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఐతే అటు కేసీఆర్‌ కూడా భద్రారెడ్డికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే మల్లన్న ట్విస్ట్ ఇచ్చారు. హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. పోటీ చేయలేనని చేతులెత్తేశారు. ఐతే మల్లారెడ్డి నిర్మయం వెనక.. అల్లుడి కాలేజీలో కూల్చివేతలే కారణం అని పక్కాగా అర్థం అవుతోంది. మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో.. అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. ఈ ఘటనే.. మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా కనిపిస్తోంది. కూల్చివేతలు మొదలవగానే.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి బేటీ అయ్యారు. సుమారు రెండు గంటలు చర్చలు జరిపారు. వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన సమయంలో.. మామా అల్లుళ్లు ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరుతారని చేరుతారన్న ప్రచారం జరిగింది.

ఐతే తాము బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఐతే మీటింగ్ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే మరింతగా వేధింపులు పెరుగుతాయని మల్లారెడ్డి కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇక అదే సమయంలో సీఎం రేవంత్‌తో మల్లారెడ్డికి పాత శతృత్వం ఉంది. ప్రతిపక్షనేతగా రేవంత్ ఉన్నప్పుడు.. ఆయనపై మల్లారెడ్డి తొడలు కొట్టి సవాళ్లు విసిరిన ఘటనలు ఎన్నో! ఏమైనా అధికారం మారితే.. అన్నీ మారతాయ్. బలం మారుతుంది, బలగం మారుతుంది.. నిర్ణయాలు కూడా మారతాయ్ అనడానికే.. మల్లారెడ్డి కొడుకు పోటీ నుంచి తప్పుకోవడమే బెస్ట్ ఎగ్జాంపుల్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.