Rakesh Roshan: కుడి ఎడమయితే.. పొరపాటు లేదేయ్.. అంటాడో కవి. నిజజీవితంలో అది నిజం కాదు. కుడి ఎడమ అయినా.. కాస్త పేరు మారినా.. సోషల్ మీడియా ఏకిపారేస్తుంటుంది ఎవరినైనా..! ఇప్పుడు బెంగాల్ సీఎం దీదీ విషయంలోనూ అదే జరిగింది. రాకేశ్ రోషన్ తెలుసుగా.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ఫాదర్. ఒకప్పుడు మంచి కేరక్టర్ ఆర్టిస్ట్. ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా కూడా మారాడు. అలాంటి రాకేశ్ రోషన్‌ను చంద్రుని మీదకు పంపించారు మమతా బెనర్జీ.
ఇదెక్కడి వార్త.. మేమెప్పుడు వినలే అని అనుకుంటున్నారా..? దీదీ జారిన చిన్న మాట అది. ఆమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండియా నుంచి మూన్ మీదకు వెళ్లిన మొదటి ఇండియన్ రాకేస్ రోషన్ అట. అవును మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీమర్లకు దొరికిపోయారు దీదీ. చంద్రయాన్ గురించి చెప్తూ చంద్రుడిపై మొదట అడుగుపెట్టిన వ్యక్తి రాకేష్ రోషన్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రుడి మీద అడుగు పెట్టి తిరిగి భూమ్మీదకు చేరుకున్న తర్వాత.. స్పేస్ నుంచి భారత్ ఎలా ఉంది అని రాకేశ్ రోషన్‌ను ఇందిరా ప్రశ్నలు అడిగారట.
దానికి సారే జహాసే అచ్చా అంటూ రాకేశ్ రోషన్ ఆన్సర్ చేశారట.. ఇలా దీదీ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. శర్మ ప్లేసులో రోషన్‌ను చేర్చి.. రాకేశ్ శర్మను పొరపాటుగా రాకేశ్ రోషన్‌గా మార్చేశారు దీదీ. దీంతో ఆమె ప్రసంగం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నార్మల్‌గా నోరు జారితేనే నెటిజన్లు మీమ్స్‌తో పిచ్చెక్కిస్తారు. ఇప్పుడు ఏకంగా రాకేష్ రోషన్‌ను మూన్ మీదకు పంపించారు మమత. ఇంకేముంది ఇంటర్నెట్‌లో ఈ విషయంపై మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఆస్ట్రోనాట్ సూట్‌లో రాకేష్ రోషన్ ఫొటోలను పెట్టి మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకొందరైతే రాకేష్ రోషన్ ఇస్రోలో పనిచేస్తున్నప్పటి ఫొటోలు అంటూ పోస్టులు పెడుతున్నారు.