Mamidala Yashaswini Reddy: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తుంటారు. గెలిచిన తరువాత తాము చేసే పనులను ముందే ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. ఏదో ఒకటి చెప్పి కుర్చీ ఎక్కేందుకు అంతా ప్రయత్నిస్తారు. ఇందులో చాలా మంది.. గెలిచిన తరువాత.. ఇచ్చిన హామీలను మర్చిపోతారు. ఎవరు అడుగుతారులే అన్నట్టు సైలెంట్ ఐపోతారు. ఐదేళ్లు రాజ్యాన్ని ఏలుతారు. మళ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆ విషయాలు ప్రజలు కూడా మర్చిపోతారు. కానీ కొందరు నేతలు మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. అలాంటి నేతల్లో ఒకరే పాలకుర్తి ఎమ్మెల్యే హనుమాండ్ల యశశ్విని రెడ్డి.
REVANTH VS NANI: కొడాలి నానిని రానీయొద్దు! నో ఎంట్రీ అంటున్న రేవంత్..
తెలంగాణలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఈమె.. ఎన్నికల సమయంలో పాలకుర్తి ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే పాలకుర్తిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. దాని ద్వారా చదువుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామంటూ చెప్పారు. ఆమె కోరినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో యశశ్వినిని గెలిపించారు పాలకుర్తి ప్రజలు. ఆమె గెలిచింది ఎవరో నార్మల్ లీడర్ మీద కూడా కాదు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ మంత్రి.. ఎర్రబెల్లి దయాకర్ రావు మీద. ఆయన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేకుండానే.. ఆయనను ఎన్నికల్లో ఓడించి ఇంటికే పరిమితం చేశారు యశ్వశ్విని రెడ్డి. తనను ఆదరించి, గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు పనులు కూడా మొదలు పెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా తన సొంత ఖర్చులతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం తన 74 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు యశశ్విని. అక్కడే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కట్టబోతున్నారు.
డిగ్రీ చేసిన ప్రతీ ఒక్కరికీ ఇక్కడ వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామంటూ చెప్పారు. నిన్న చెప్పిన మాట ఇవాళ మర్చిపోతున్న ఈ రోజుల్లో కూడా.. ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చుతో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న యశశ్వినికి పాలకుర్తి ప్రజలు సలాం కొడుకుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి.. వాళ్ల చేతిలోనే దేశం ఉండాలి అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన యశశ్వినిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.