Mamidala Yashaswini Reddy: అధికారం కోడలిది.. పెత్తనం అత్తగారిది.. కాంగ్రెస్‌లో కొత్త పోరు..

అత్త.. ఝాన్సీ రెడ్డి. ఆమె కోడలు యశస్వినీ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడంతో కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా..?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 08:15 PM IST

Mamidala Yashaswini Reddy: మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న చోట్ల సాధారణంగా భర్తల పెత్తనం ఎక్కువగా ఉంటుంది. కానీ.. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రం అత్తగారి పెత్తనాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారట ఎమ్మెల్యే కోడలు. ఇంతకీ.. ఆ అత్తగారు కోడలు ఎవరిని అనుకుంటున్నారా? అత్త.. ఝాన్సీ రెడ్డి. ఆమె కోడలు యశస్వినీ రెడ్డి. సాంకేతిక కారణాల వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోవడంతో కోడలికి అవకాశం ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేశారు ఝాన్సీరెడ్డి. కోడలు ఎమ్మెల్యే అయ్యాక అత్తగారి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా..?

MLC KAVITHA: తిహార్ జైలులో కవిత కోసం స్పెషల్‌ ఏర్పాట్లు..

ప్రతి విషయంలోనూ ఇద్దరికీ పొసగటం లేదట. అసెంబ్లీ ఎన్నికల టైంలో.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా పరిగణించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సీటును వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారట. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని ఓడించడానికి దీటైన అభ్యర్థిని తెస్తానంటూ ఎన్నికలకు రెండు నెలల ముందే ప్రకటించారు. ఆయన చెప్పినట్టే పాలకుర్తిలో ఎర్రబెల్లిని ఓడించి కాంగ్రెస్ జెండా ఎగిరింది. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. వాస్తవానికి ఈ టిక్కెట్‌ను యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ.. పౌరసత్వం సమస్యల కారణంగా ఆమెను పక్కనపెట్టి కోడలు యశస్విని రెడ్డిని బరిలో దించింది కాంగ్రెస్ పార్టీ. వ్యూహాత్మక ఎత్తుగడలతో పాలకుర్తిలో పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్‌ పెద్దలు. ఇక ఆల్‌‌ సెట్‌ అనుకుంటూ.. సాదాసీదాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. కానీ.. నియోజకవర్గంలోను, పార్టీలోను అత్త పోరు పడలేకపోతున్నారట ఆమె. చివరికి అత్తా కోడళ్ళ కొట్లాట పెరిగి.. గాంధీభవన్‌ ముందు ధర్నా చేసేదాకా వెళ్ళింది. ఝాన్సీ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకులందరినీ పక్కన పెట్టడంతో పాటు నోటీసులు ఇప్పించి.. పార్టీ నుంచి బయటికి పంపుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ.

AP BJP Tickets: సీనియర్లకు హ్యాండిచ్చిన బీజేపీ.. హడావిడి బ్యాచ్‌ని పక్కన పెట్టిన కమలం పెద్దలు..!

ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కొని నాడు గెలిచారంటే.. నియోజకవర్గ కేడర్‌, లీడర్స్‌ అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమైందన్నది లోకల్‌ టాక్‌. అంత కసిగా పనిచేస్తే.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఝాన్సీరెడ్డి ఎమ్మెల్యే కంటే ఎక్కువ జోక్యం చేసుకుంటూ పార్టీ నాయకులని ఇబ్బందిపెడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్‌లో గాంధీభవన్ ముందు ధర్నా చేశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌కి ఫిర్యాదు చేశారు. దేవరుప్పల మoడల పార్టీ అధ్యక్షుడి తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు కార్యకర్తలు. పేరుకే ఎమ్మెల్యే యశిస్విని రెడ్డి అని, పెత్తనమంతా అత్త ఝాన్సీరెడ్డి చేస్తున్నారంటూ వాపోయారు ఆందోళనలో పాల్గొన్న నేతలు. ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులను పక్కన బెట్టుకొని ఝాన్సీరెడ్డి సొంత పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నది కేడర్‌ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం ఇటీవల పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు ఫోకస్‌ పెడుతున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో డ్యామేజ్‌ జరగకుండా చర్యలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పని చేసిన ఓ వర్గం.. ఇప్పుడు తాము సూచించిన వారికి పోస్టింగులు ఇవ్వడం లేదన్న అక్కసుతో.. కొంతమందిని ముందు పెట్టి ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సమస్య ఏదైనా.. ప్రతిష్టాత్మకంగా గెలుచుకున్న పాలకుర్తిలో అత్తా కోడళ్ళ పంచాయతీ పార్టీకి తలనొప్పిగా మారింది. కోడలు ఎమ్మెల్యే అయినా.. అత్త పెత్తనం పెరిగిపోతోందని, ప్రత్యేకించి ప్రత్యర్థుల్ని పక్కన పెట్టుకుని సొంతోళ్ళనే ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలకుర్తి కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో తేడా జరిగితే.. సీఎం రేవంత్ అంత ఈజీగా తీసుకునే పరిస్థితి ఉండదన్నది ఓపెన్ టాక్. మరి ఎలక్షన్‌ టైంకి ఈ అత్తా కోడళ్ళ వ్యవహారాన్ని గాంధీ భవన్‌ నాయకత్వం ఎలా సెట్‌ చేస్తుందన్నది చూడాలి.