జగన్ మెచ్చిన రెడ్డి గారికే బాబు జై

ఆసియాలో రెండో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం. బ్రిటీష్ వాళ్ళు స్వాతంత్ర్యం ప్రకటించక ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 2014 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగినా... 2019 నుంచి 24 వరకు నత్త నడకన సాగాయి.

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 12:58 PM IST

ఆసియాలో రెండో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం. బ్రిటీష్ వాళ్ళు స్వాతంత్ర్యం ప్రకటించక ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 2014 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగినా… 2019 నుంచి 24 వరకు నత్త నడకన సాగాయి. ఇప్పుడు మళ్ళీ పనులను పునరుద్దరించడానికి చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఏ అంటే అమరావతి పీ అంటే పోలవరం అంటూ ముందుకుపోతుంది చంద్రబాబు సర్కార్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 లో పోలవరం ప్రాజెక్ట్ పనులను మెగా కంపెనీకి అప్పగించారు.

దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. రివర్స్ టెండరింగ్ పేరుతో బినామీలకు సొంత కులానికి ప్రాజెక్ట్ లను కట్టబెడుతున్నారు అని టీడీపీ నేతలు సైతం మండిపడ్డారు. అయితే దీనిని ప్రభుత్వం సమర్ధించుకుంది అప్పుడు. రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం నీటిపారుదల, జల విద్యుత్ ప్రాజెక్ట్ లలో దాదాపు 780 కోట్లు ఆదా చేసారని అప్పటి జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పేర్కొన్నారు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ అయినా నిర్మాణ పనులను పర్యవేక్షించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే.

దీనితో అప్పుడు కాంట్రాక్టర్ ను మార్చడాన్ని చంద్రబాబు అండ్ కో తప్పుబట్టింది. టీడీపీ విమర్శించినట్టు గానే పోలవరం పనులు అసలు ముందుకు సాగలేదు. ఈ మధ్యలో పోలవరం నిర్మాణంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ ను చూడటానికి ఎవరిని అనుమతించలేదు కూడా. అదంతా గతం… ఇప్పుడు పోలవరం పనుల సంగతి ఏంటీ…? మెగా కంపెనీనే ఆ బాధ్యతలు చూస్తుందా లేదంటే కొత్త సంస్థకు బాధ్యతలు ఇస్తారా…? మెగా కృష్ణా రెడ్డి… అటు బీఆర్ఎస్ కు ఇటు వైసీపీకి దగ్గర కాబట్టి చంద్రబాబు మెగాను తప్పించి మరో సంస్థకు ఇస్తారని అందరూ ఊహించారు.

గతంలో మెగాను చంద్రబాబు సర్కార్ తప్పించి నవయుగకు ఇచ్చింది. మళ్ళీ నవయుగ నుంచి మరో సంస్థకు ఇస్తే… జగన్ వచ్చాక మళ్ళీ మెగాకు ఇచ్చారు. కాని ఇప్పుడు ఏం జరిగిందో ఏమో… మెగా సంస్థనే పోలవరం కట్టాలి అంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు… పోలవరం ప్రాజెక్టుపై జలశక్తిశాఖ మంత్రితో భేటీ అయ్యారు. సీఆర్ పాటిల్‌తో గంటసేపు చర్చించిన సీఎం చంద్రబాబు, మంత్రులు… 2022లో టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పోలవరం పనులు వేగంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని… 2022లో టెండర్ ఖరారు చేసిన ధరలకే ఇవ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఏ సంకేతం ఇవ్వాలనుకుందో గాని… ప్రజలకు మాత్రం ఒక విషయం అర్ధమైంది. జగన్ కారణంగానే నిర్మాణ సంస్థ పనులు చేయలేదని… కృష్ణా రెడ్డి మంచోడే గాని జగన్ రెడ్డే చెడగొట్టాడు అని చెప్పే ప్రయత్నం చేసింది సర్కార్.