MINISTER ROJA: మంత్రి రోజాకు పొగపెడుతున్నారా.. టికెట్‌ లేదని క్లారిటీ వచ్చేసిందా..?

పదవి కోసం 40 లక్షలు డిమాండ్ చేశారని చెప్పిన అమె.. రోజాకు అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తమకు పదవి ఇవ్వలేదని.. తిరిగి తమ డబ్బులు తమకు ఇవ్వాలన్నా రెస్పాండ్ కావడం లేదని అన్నారు. ఐతే ఆ కౌన్సిలర్.. సరిగ్గా ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఆసక్తికర చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 07:19 PM IST

MINISTER ROJA: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీలో అయితే మరీ పీక్స్‌కు చేరింది ఈ వ్యవహారం. టికెట్ల విషయంలో.. ఆ పార్టీ నేతలు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. జనాల్లో వ్యతిరేకత, ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. వారి స్థానంలో కొత్త ఇంచార్జిలను నియమిస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య మంత్రి రోజాకు ఊహించని పరిణామం ఎదరైంది. ఆమె ఫ్యామిలీపై పుత్తూరు వార్డు కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేశారు.

Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా వైసీపీ వేటు..?

పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్ పదవి అమ్ముకున్నారన్నట్లుగా ఆరోపించారు. పదవి కోసం 40 లక్షలు డిమాండ్ చేశారని చెప్పిన అమె.. రోజాకు అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తమకు పదవి ఇవ్వలేదని.. తిరిగి తమ డబ్బులు తమకు ఇవ్వాలన్నా రెస్పాండ్ కావడం లేదని అన్నారు. ఐతే ఆ కౌన్సిలర్.. సరిగ్గా ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లాలో రోజా వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా యుద్ధం సాగుతోంది. రోజాకు టికెట్ ఇస్తే పనిచేసేదే లేదు అని వైసీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. అయినా సరే రోజా విషయంలో జగన్ సాఫ్ట్‌ కార్నర్‌తో ఉన్నారని.. టికెట్ దాదాపు కన్ఫార్మ్ అయిందనే ప్రచారం జరుగుతున్న వేళ.. కౌన్సిలర్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు గుప్పించడం కొత్త చర్చకు కారణం అవుతోంది. రోజాకు టికెట్ ఎగ్గొట్టేందుకు రంగం సిద్ధం అయిందని కొందరు అంటుంటే.. రోజా ప్రత్యర్థి వర్గం తమ వ్యూహాలకు పదును పెంచిందని గుసగుసలు వినిపిస్తున్నాయ్.

నగరిలో రోజాకు ఏ ఒక్క నేతతోనూ సన్నిహిత సంబంధాలు లేవు అన్నది వైసీపీలో వినిపించే మాట. అందరితోనూ గొడవలే ఉన్నాయని వారు ఆరోపిస్తుంటారు. వీటికితోడు ఇప్పుడు పదవుల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయ్. ఇక అటు సర్వేలు కూడా రోజాకు షాక్ ఇచ్చాయ్. నగరి మొత్తం ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆమెకు ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెప్తున్నాయ్. ఇలాంటి టైమ్‌లో టికెట్ లేదు అని చెప్పడానికి ఓ బలమైన కారణం కావాలి.. అలాంటి అవకాశమే ఇప్పుడు వచ్చిందని వైసీపీలోనే వినిపిస్తున్న మాట. మరి ఇలాంటి పరిణామాల మధ్య రోజాకు టికెట్ వస్తుందా లేదా అన్నది మరింత ఆసక్తికరంగా మారింది.