MINISTER ROJA: టీడీపీని వీడినప్పటి నుంచి వేధింపులు.. బండారు వ్యాఖ్యలపై కన్నీళ్లు పెట్టుకున్న రోజా

దేశం మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు సంతోషించాలా..? లేక బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడినా మాటలకు బాధపడాలా..? ఇలాంటి వారి మాటలకు భయపడి మహిళలు రాజకీయాల్లోకి రారేమో. మహిళా కోసం ఎన్నో పోరాటాలు చేసినా నాపై అత్యంత దారుణంగా మాట్లాడారు.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 07:51 PM IST

MINISTER ROJA: తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. బండారు వ్యాఖ్యలను ఎవరూ సమర్ధించరని రోజా వ్యాఖ్యానించారు. ఈ మాటలను అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం రోజా తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా లోకేశ్, బండారుపై విమర్శలు చేశారు. తనపై వ్యాఖ్యలు చేసే వాళ్లను నారా లోకేశ్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. “దేశం మొత్తం 33 శాతం రిజర్వేషన్ ఇచ్చినందుకు సంతోషించాలా..? లేక బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడినా మాటలకు బాధపడాలా..? ఇలాంటి వారి మాటలకు భయపడి మహిళలు రాజకీయాల్లోకి రారేమో. మహిళా కోసం ఎన్నో పోరాటాలు చేసినా నాపై అత్యంత దారుణంగా మాట్లాడారు.

అ మాటలు ఎవరు విన్నా బండారును చెప్పుతో కొట్టకుండా ఉండరు. లోకేష్ సహా ఇతర నేతల ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళను తిడితే మీకు ఒకేనా..? మీ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా..? మేము మహిళలం కాదా..? మాకు మనసు లేదా..? అందరినీ ఇలానే మాట్లాడుతారా..? టీడీపీని వీడినప్పటి నుంచి ఇలానే నన్ను వేధిస్తున్నారు. మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. లోకేష్ ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితి రేపు లోకేష్ భార్యకు వస్తుంది. బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలి. టీడీపీ తెలుగు దండుపాళ్యం పార్టీలా మారింది. టీడీపీలో మహిళలకు గౌరవం లేదు. ఏ మహిళకైనా మనస్సు ఉంటుంది. చేయని తప్పుకి శిక్ష వేస్తున్నారు. నేను చేసిన అభివృద్ధిపై నాతో చర్చకు రండి. అరెస్ట్ చేశారని బండారును వదలను. ఆయనపై పరువు నష్టం దావా వేస్తా.
లోకేశ్.. నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా..?
“లోకేశ్.. నీకు ఫ్యామిలీ లేదా.. నీ ఫ్యామిలీని తిడితే ఊరుకుంటావా..? నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా..? టీడీపీలో ఉన్న మహిళలు బండారు వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు. బండారు భార్యను అడుగుతున్నా.. ఆ రోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు. పదేళ్లు టీడీపీలో పని చేశా. ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేను రాజకీయంగా, మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆడ పుట్టుకను అపహాస్యం చేసిన వ్యక్తి బండారు. ఆ పార్టీకి అద్యక్షుడు చంద్రబాబు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి అని చెప్పిన వ్యక్తి బాలకృష్ణ. నా నియోజకవర్గంలో నేనేం చేశానో చూపిస్తా. దమ్ముంటే నా నియోజకవర్గానికి రండి” అని రోజా వ్యాఖ్యానించారు.