అయితే ముందు నుంచీ ఉన్న సస్పెన్స్ ఒక్కటే. కొత్త సచివాలయంలో సీఎం చైర్‌లో కూర్చున్న తరువాత.. సీఎం కేసీఆర్ మొదట ఏ ఫైల్ మీద సంతకం పెట్టబోతున్నారు అని. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెర పడింది. కొత్త సచివాలయంలో మొదటి ఫైల్ మీద సీఎం కేసీఆర్ సంతకం పెట్టారు. తెలంగాణలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే ఫైల్‌పై సంతకం చేశారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు.
ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు స్వయంగా చెప్పారు. సచివాలయం ఓపెనింగ్ రోజే ఉద్యోగులకు రెగ్యులరైజేషన్‌తో ట్రీట్ ఇచ్చారని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్ ఫైల్‌పై కొత్త సచివాలయంలో ఆయన తొలి సంతకం చేశారు. ఇక మిగిలిన మంత్రులు కూడా తమ ఛాంబర్స్‌లో ఫైల్స్ మీద సంతకాలు చేశారు. లక్ష మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చే ఫైల్‌పై మంత్రి కేటీఆర్ సంతకం పెట్టారు.
తెలంగాణలో కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేస్తూ హోంమంత్రి మహమూద్ అలీ తొలి ఫైల్ మీద సంతకం చేశారు. ట్విన్ సిటీస్‌లోని దేవాలయాల్లో ప్రసాదంగా మిల్లెట్స్ కూడా అందించేలా తయారు చేసిన ఫైల్ మీద దేవాదయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొదటి సంతకం చేశారు. కార్మికులకు శ్రమశక్తి అవార్డ్ ఇచ్చేందుకు తయారు చేసిన ఫైల్ మంత్రి మల్లారెడ్డి సంతకం చేశారు. శ్రమ శక్తి అవార్డుల కేటాయింపు ఫైల్‌పై మంత్రి మల్లారెడ్డి సంతకం పెట్టారు.
అంగన్ వాడీలకు సన్న బియ్యం పంపిణీ ఫైల్‌పై మంత్రి గంగుల కమలాకర్ సంతకం పెట్టారు. రెండో విడత దళిత బంధు పథకం ఫైల్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతకం చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం ఫైల్‌పై మంత్రి నిరంజన్ రెడ్డి తొలి సంతకం చేశారు. కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలుపై మంత్రి ఎర్రబెల్లి తొలి సంతకం చేశారు.