ASSEMBLY ELECTIONS: ఎట్టకేలకు తెలంగాణలో కొత్త పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి బై చెప్పి.. తెలంగాణ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసింది ఆ పార్టీ. కనీసం బీట్ చెయ్యలేని రేంజ్‌లో 65 స్థానాల్లో గెలిచి విజయభేరి మోగించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. త్వరలోనే కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణా కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటికీ బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పడ్డ ఓట్లలో కేవలం 2 శాతం మాత్రమే తేడా ఉంది.
CONGRESS: రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ పాగా.. అధిక సీట్లు గెలుచుకున్న హస్తం..
దాదాపు 30 నియోజకవర్గాల్లో పోటాపోటీ పోరు జరిగింది. కేవలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మాత్రమే కాదు. చాలా ప్రాంతాల్లో వివిధ పార్టీల్లో కూడా ఇదే సీన్ కనిపించింది. చాలా చిన్న మార్జిన్‌తో ఎమ్మెల్యే పదవులను కోల్పోయారు చాలా మంది. ఈ నియోజకవర్గాల్లో కేవలం వందల సంఖ్యల ఓట్లతోనే గెలుపు ఓటములు డిసైడయ్యాయి. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన భరత్ మీద.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కాలే యాదయ్య కేవలం 268 ఓట్ల తేడాతో గెలిచారు. యాకత్‌పురాలో ఎంబీటీ అభ్యర్థిపై హుస్సేన్ మిరాజ్ 878 ఓట్ల తేడాతో గెలిచారు. జుక్కల్‌లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన హన్మంతుషిండేపై కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతారావు 1152 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక దేవరకద్రలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మధు 1392 ఓట్ల తేడాతో గెలిచారు.
నాంపల్లి సెగ్మెంట్‌లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన మాజిద్ హుస్సేన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ కేవలం 2037 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కేవలం ఇవి మాత్రమే కాదు.. చాలా నియోజకవర్గాల్లో కేవలం వందల సంఖ్యలోనే ఓట్లు గెలుపు ఓటములను డిసైడ్ చేశాయి.