MLC KAVITHA: మాజీ సీఎం KCR కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈమధ్య ఏ పని మొదలుపెట్టినా కలిసి రావడం లేదు. తన మీదకు ఏదైనా కేసు వస్తుంది అనుకుంటే చాలు.. ఏదో ఒక కార్డు బయటకు తీసి మందీ మార్బలంతో ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఈమధ్య కవిత చేపడుతున్న కార్యక్రమాలేవీ సక్సెస్ కావడం లేదు. అంతకంటే ముఖ్యంగా జనం పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు. అలాగే ఆమె పెట్టిన ప్రెస్ మీట్స్ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత దగ్గరున్న కార్డులకు ఎక్స్‌పైరీ డేట్స్ అయిపోతున్నాయి. దాంతో అవి ఏ మాత్రం పనిచేయట్లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను ఈడీ అధికారులు విచారణకు పిలిపించారు.
PAWAN KALYAN: పొత్తులపై తొందరపాటు మాటలొద్దు.. జనసైనికులకు పవన్ సూచన
అప్పుడు.. ‘మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నాను.. అందువల్ల ఐ యామ్ బిజీ’ అని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఆ కార్యక్రమం మొక్కుబడిగానే సాగింది. మిగతా పార్టీల లీడర్లు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా నిజంగా నీకు మహిళా కోటాపై శ్రద్ధే ఉంటే.. బీఆర్ఎస్ హయాంలో మొదటి కేబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి ఎందుకీయలేదు.. మీ పార్టీలో మహిళలకు 30శాతం టిక్కెట్లు ఎందుకు ఇవ్వలేదు అని రాజకీయ నేతలతోపాటు జనం కూడా ప్రశ్నించారు. వాటికి సమాధానం చెప్పుకోలేకపోయింది కవిత. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే.. అది తమ ఘనతే అంటూ స్వీట్స్ పంచుకున్నారు కవిత. ఇప్పుడు మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం గురించి ధర్నాలు, ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో నిన్న గాక మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. డెడ్‌లైన్స్.. అల్టిమేటమ్స్.. అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఇష్యూపైనా జనం మండిపడుతున్నారు. ‘పూలే మీద నిజంగా ప్రేమ ఉంటే.. మరి BRS ఉన్న పదేళ్ళల్లో ఎందుకు విగ్రహం పెట్టలేదు. అసలు బీసీల మీద కవితకు ఇప్పుడు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది. కేసీఆర్ బీసీ బంధు ఎందుకు పెట్టలేదు.
YS SHARMILA: ఏపీ కాంగ్రెస్‌కు ఇన్ని దరఖాస్తులా.. షర్మిల గోల్డెన్ లెగ్ అయ్యారా?
బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని టిక్కెట్లు ఇచ్చారు’ అంటూ కొండా సురేఖ, సీతక్క ఇవే ప్రశ్నలు అడిగేసరికి మళ్ళీ కవితక్క నుంచి రిప్లయ్ లేదు. నిన్నగాక మొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఆంధ్రా వాళ్ళని సభ్యులుగా ఎలా నియమించారని నిలదీశారు కవిత. విద్యుత్ సంస్థలో ముగ్గురు ఆంధ్రా అధికారులను డైరెక్టర్లుగా ఎలా పెట్టారని అడిగారు. వీళ్ళు తెలంగాణ ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు. అంతేకాకుండా.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని TSPSC ఛైర్మన్ చేయడంపైనా మండిపడ్డారు. ఆయన లక్షకోట్లు సంపాదించారని అప్పట్లో రేవంత్ అన్నారు కదా.. ఆయనకు ఇప్పుడు ఛైర్మన్ పదవి ఎందుకిచ్చారు అనేది కవితక్క ప్రశ్న. ఇక్కడ కూడా కవిత చాలా విషయాలు మర్చిపోయారు. కాళేశ్వరం లాంటి బడా బడా ప్రాజెక్టులకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించింది ఎవరు..? వాళ్ళకి బిల్లులను క్లియర్ చేసిన కేసీఆర్ సర్కార్.. తెలంగాణ కాంట్రాక్టర్లకు మాత్రం భారీ మొత్తంలో పెండింగ్ పెట్టింది. GHMC లో చిన్నచిన్న పనులు చేసిన తెలంగాణ కాంట్రాక్టర్లు కొందరు బిల్లులు రాక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆంధ్ర అని అభ్యంతరం చెప్పినా శాంతి కుమారికి సీఎస్ పదవి ఎలా ఇచ్చారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు హెల్ప్ చేస్తున్నాడని అక్కడి వ్యక్తిని తీసుకొచ్చి.. ఇక్కడి ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టుకొని వేల రూపాయలు ఎలా దోచిపెట్టారు. ఆంధ్ర మీద అంత అక్కసు ఉంటే.. మరి బీఆర్ఎస్ ను ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు విస్తరించారు ? అక్కడి అధ్యక్షుడిని ఎందుకు నియమించారు. కవితక్కకు నిజంగా ఇవన్నీ ఐడియా లేదా. అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియక.. కాంగ్రెస్ సర్కార్ మీద ఏదో ఒక ఇష్యూతో దాడి చేయాలని కవిత ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఆమె లేవనెత్తిన ఆంధ్రా-తెలంగాణ, బీసీ కార్డులు.. ఇప్పుదేవీ పనిచేయడం లేదు. బీసీలకు న్యాయం చేయాలని అంతగా అనుకుంటే.. కేసీఆర్‌కు చెప్పి.. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఇప్పించాలి. అసెంబ్లీలో బీసీలకు ఫ్లోర్ లీడర్ పదవి ఇప్పించాలి.. ఇవన్నీ బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన డిమాండ్స్. వీటికి కవిత ఒప్పుకుంటారా.. కేసీఆర్‌తో ఒప్పిస్తారా ? ఈ విషయంలో కవిత ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.