MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత విచారణ కొనసాగుతోంది. ఏడు రోజులు కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. లిక్కర్ స్కాంలో డబ్బు సమకూర్చింది ఎవరు.. ఈ డీల్‌లో వచ్చిన డబ్బుతో కవిత ఏం చేశారు.. ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఇవే ఇప్పుడు కవిత విచారణలో ఎక్కువగా వినిపిస్తున్నా క్వశ్చన్స్. ఇదిలా ఉండగానే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీం కోర్టులో పిల్‌కూడా దాఖలు చేశారు.
Addanki Dayakar: అయ్యో పాపం.. అద్దంకి దయాకర్‌కు మళ్లీ అన్యాయం..
ఈడీ నుంచి కవితను కాపాడేందుకు ఆమె భర్త అనిల్ న్యాయపోరాటం చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయిన అదే రాత్రి అనిల్ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఉండి లాయర్స్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎప్పడికప్పుడు అప్‌డేట్స్ భార్యకు ఇస్తూ.. ఆమెను బయటికి తీసుకువచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయిన టైంలో కూడా వాళ్లిద్దరి మధ్య కనిపించిన ఎమోషన్ సీన్ ప్రతీ ఒక్కరినీ ఎమోషనల్ చేసింది. ఈడీ అధికారులు కవితను తీసుకువెళ్తున్న టైంలో కవిత భర్తను హత్తుకుని ఏడ్చేసింది. ఇప్పుడు మాత్రమే కాదు. గతంలో కవిత ఈడీ విచారణకు వెళ్లినప్పుడు కూడా అనిల్ కవిత వెంటే ఉన్నారు. ఈడీ ఆఫీస్‌లోపలికి కవిత వెళ్తున్నప్పుడు కూడా ఆమెను హగ్ చేసుకుని ధైర్యం చెప్పారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అదే ధైర్యంతో కవిత ఎలా లోపలికి వెళ్లింది అంతే ధైర్యంతో విచారణ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చింది. ఆమెను అప్పుడే అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈడీ మాత్రం చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్‌గా కవితను అరెస్ట్ చేసింది. కవితకు సంబంధించిన చాలా విషయాల్లో అనిల్ పాత్ర ప్రధానంగా ఉంటుంది.
రాజకీయంలో ఐనా వ్యక్తగత జీవితంలో ఐనా కవితను అనిల్ చాలా సపోర్ట్ చేస్తుంటారని వాళ్ల దగ్గరి వ్యక్తులు చెప్తుంటారు. ఇప్పుడు కూడా అనిల్ అదే చేస్తున్నారు. భార్య అరెస్ట్ ఐన మరుక్షణం నుంచి అనిల్ లాయర్స్‌తో టచ్‌లోనే ఉన్నారు. ఇంట్లో పిల్లలకు ధైర్యం చెప్తూ, మరోపక్క పార్టీ నేతల్లో భరోసా నింపుతూ.. భార్య కోసం భర్తగా పోరాటం చేస్తున్నారు. ఈ స్కాంలో కవిత తప్పు ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే.. కవిత కోసం అనిల్ చేస్తున్న పోరాటానికి మాత్రం ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అర్ధం చేసుకునే భాగస్వామి దొరకడం అదృష్టం అంటారు. ఇప్పుడు కవిత అనిల్‌ను చూసినవాళ్లు కూడా ఇదే అంటున్నారు. మరి అనిల్ కష్టానికి ప్రతిఫలం ఉంటుందా.. కవిత బయటికి వస్తుందా లేదా చూడాలి.