MLC KAVITHA: తిహార్‌ జైలు అంత డేంజరా..? లోపల ఎలా ఉంటుందో తెలుసా..?

కవిత తీహార్‌ జైలుకు వెళ్తోంది అంటే.. అసలు అది ఎలా ఉంటుంది.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్. అంత డేంజర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది. తీహార్ జైలు అంటే.. భయంకరమైన ప్రాంతమన్నది పెద్ద అపోహ.

  • Written By:
  • Updated On - March 27, 2024 / 01:06 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో కవితకు.. 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది కోర్డు. దీంతో ఆమెను పోలీసులు తీహార్‌ జైలుకు తరలించారు. సామాన్య ఖైదీలా వ్యానులో కవితను.. జైలుకు తీసుకెళ్లారు. ఐతే రిమాండ్‌ ఖైదీగా కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐతే తీహార్ జైలు అంటే.. చాలామందికి భయం. ఈ పేరు వింటేనే వణికిపోయే వాళ్లు ఎందరో. అలాంటిది కవిత తీహార్‌ జైలుకు వెళ్తోంది అంటే.. అసలు అది ఎలా ఉంటుంది.. లోపల ఎలాంటి పరిస్థితులు ఉంటాయ్.. అంత డేంజర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది.

Mamidala Yashaswini Reddy: అధికారం కోడలిది.. పెత్తనం అత్తగారిది.. కాంగ్రెస్‌లో కొత్త పోరు..

తీహార్ జైలు అంటే.. భయంకరమైన ప్రాంతమన్నది పెద్ద అపోహ. తీహార్‌ జైలులోనే కొన్ని సంస్కరణలు మొదలయ్యాయ్. ఇది దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైల్. తీహార్ అనే ఏరియాలో ఉండడంతో దీన్ని తీహార్ జైలు అంటారు. ఢిల్లీలోని చాణక్యపురి నుంచి 7కిలోమీటర్ల దూరంలో ఈ జైలు ఉంటుంది. తీహార్‌ జైలులో దాదాపు 10వేల మంది ఖైదీలకు సరిపోయే వసతులు ఉన్నాయ్. ఐతే అంతకుమించి ఈ జైలులో ఎప్పుడూ ఎక్కువమంది కనిపిస్తుంటారు. భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ.. ఈ ప్రాంతం నుంచే సంస్కరణలు మొదలుపెట్టారు. ఎంతోమంది రాజకీయ నేతలకు, పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు, ఉద్యమ నాయకులకు ఈ జైలు ఆశ్రయం ఇచ్చింది. అందుకే దీన్ని తీహార్ ఆశ్రమం అంటారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో.. అత్యంత కీలకులైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌ను ఈ జైలులోనే నిర్భంధించారు.

కేంద్ర మాజీ మంత్రి కనిమొళిని 2జీ కేసులో అరెస్ట్ చేసి ఇదే జైలులోనే పెట్టారు. తీహార్‌ జైలులో ప్రస్తుతం 15 వేలకు పైగా ఖైదీలు ఉన్నారు. వారందరికీ ఆహారం పెట్టడం చాలా కష్టతరమైన పని. జైలులో 4వంటగదులు ఉంటాయి. వేసవి సమయంలో.. ఈ వంటగది చాలా వేడిగా ఉంటుంది. ఇందులో వంట చేయడానికి.. సిబ్బంది మరియు ఖైదీలు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని. ఖైదీలకు ఉదయం 5గంటలకు టిఫిన్ పెడతారు. అందులో.. రోటీలు, చపాతీలు, పూరీలు, పప్పును పెడతారు. మధ్యాహ్నాం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ, పెథా పెడతారు. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి రెండుసార్లు ఖీర్ పెడతారు. ఖైదీలకు ఇక్కడ మాంసాహారాన్ని ఉచితంగా పెట్టరు. కష్టపడిన డబ్బులతో.. వారు వీకెండ్‌లో స్వయంగా క్యాంటీన్‌లో కొనుక్కోని తినాల్సి ఉంటుంది.