MLC KAVITHA: కవిత సింపథీ గేమ్ మొదలుపెట్టారా.. లిక్కర్ కేసులో సీబీఐ నెక్ట్స్ స్టెప్‌ ఏంటి..?

విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండటంతో.. సీబీఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందనే ప్రశ్న వినిపిస్తోంది. లిక్కర్ స్కాంలో నిందితురాలిగా పేర్కొంటూ.. విచారణకు రావాలని ఐదు రోజుల కింద కవితకు 41A కింద సీబీఐ నోటీసులిచ్చింది.

  • Written By:
  • Updated On - February 26, 2024 / 08:50 PM IST

MLC KAVITHA: లిక్కర్ కేసులో కవిత అరెస్ట్‌ అయ్యే వరకు లాగుతున్నారా.. ఇదే జరగబోతోందని ఇప్పటికే మానసికంగా సిద్ధమైన కవిత.. ఎంతవరకు వీలైతే అంత.. ఈ కేసులో తనకు పాజిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా..? ఈడీ విచారణకు తాను హాజరుకానని, కోర్టు కేసు అడ్డంపెట్టి తప్పించుకుంటున్న కవిత.. సీబీఐకి కూడా అదే సమాధానం చెప్పారు. ఎక్కడ కేసులో తన అరెస్టు తప్పదని కవితకు తెలిసినా చివరి వరకు ఎంత వీలైతే అంత ఈ కేసులో సానుభూతి సంపాదించాలనేది ఆమె ప్లాన్.

YS SHARMILA: మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యం అమ్ముతారా.. జగన్‌పై షర్మిల ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఏం చేయబోతోంది..? విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దూరంగా ఉండటంతో.. సీబీఐ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందనే ప్రశ్న వినిపిస్తోంది. లిక్కర్ స్కాంలో నిందితురాలిగా పేర్కొంటూ.. విచారణకు రావాలని ఐదు రోజుల కింద కవితకు 41A కింద సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో విచారణకు హాజరు కావడం సాధ్యం కాదంటూ సీబీఐకి లేఖ రాసిన కవిత.. విచారణకు దూరంగా ఉన్నారు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది అని దర్యాప్తు సంస్థల ఆరోపణ. గతంలో లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సీబీఐ ప్రశ్నించింది. అయితే ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేరుస్తూ 41A కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద నోటీసులు జారీ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సీబీఐకి అధికారం ఉంటుందన్నది నిపుణులు చెప్తున్న మాట.

ఇలాంటి పరిస్థితుల్లో కవిత రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలా.. లేదా.. అనే విషయంపై సీబీఐ దృష్టి పెట్టింది. వాస్తవానికి ఈడీ విచారణ విషయంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉంది. తాను విచారణకు రాకపోవడానికి తెలిపిన కారణాల్లో.. కోర్టు కేసును కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. ఒకట్రెండు రోజుల్లో లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో.. కవితకు మరోసారి నోటీసులు ఇవ్వాలా.. లేదంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు వేచిచూడాలా అనే విషయంపై సీబీఐ అధికారులు ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా.. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ జరుపుతున్న రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేయాలా అనే కోణంలోనూ సీబీఐ అధికారులు కసరత్తు చేస్తున్నారు.