MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మొన్నటి దాకా సమాచారం కోసం ఆమెను పిలిచి ఎంక్వైరీ చేసింది సీబీఐ. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపారు అధికారులు. 41A కింద నోటీలిచ్చామని సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చింది. ఈనెల 26న విచారణకు రావాలని నోటీసులు కూడా ఇవ్వడంతో.. ఆరోజున కవితను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది.
PM Modi: ప్రధాని మోదీ గురించి అలాంటి సమాధానమా..? గూగుల్ ఏఐ జెమినిపై కేంద్రం ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ కేసులో 2022లో కవితను సుదీర్ఘంగా విచారించింది సీబీఐ. అటు ఈడీ కూడా ఆమెను నిందితురాలిగా చేర్చకుండానే మూడుసార్లు ఎంక్వైరీ చేసింది. కానీ ఈసారి మాత్రం నిందితురాలిగా పిలుస్తోంది సీబీఐ. దర్యాప్తు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు తెలిపారు అధికారులు. లిక్కర్ స్కామ్‌లో నిందితుల స్టేట్మెంట్స్ ఆధారంగానే కవితను నిందితురాలిగా చేర్చినట్టు తెలుస్తోంది. న్యాయమూర్తి ముందు కవిత పీఏ అశోక్ కౌశిక్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. లిక్కర్ దందాలో కొంతమందికి ముడుపులు ఇచ్చామని జడ్జి ముందు కౌశిక్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అదే ఇప్పుడు కవిత మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అశోక్ కౌశిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. వీటికి కవిత రిప్లయ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమె ఏం సమాధానం ఇచ్చింది అన్నది మాత్రం బయటకు రాలేదు. ఈ కేసులో కవితతో పాటు అశోక్ కౌశిక్‌ను కూడా నిందితులుగా సీబీఐ పరిగణిస్తోంది.
ఇక ఈడీ విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో తాను విచారణకు రావట్లేదని ఈడీ అధికారులకు ఆమె లెటర్ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఎలాంటి రిప్లయ్ రాలేదు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై మళ్లీ ఈ నెల 28న విచారణ జరుగుతోంది. దానికంటే రెండు రోజుల ముందే కవితను సీబీఐ ఎంక్వైరీకి పిలవడం.. పైగా లిక్కర్ కేసులో నిందితురాలిగా కూడా చేర్చడంతో ఆమెను అరెస్ట్ చేస్తారన్న టాక్ నడుస్తోంది.