MLC KAVITHA: కవిత సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌..

తాజాగా ఎమ్మెల్సీ కవిత అకౌంట్‌ కూడా హ్యాక్‌ అయ్యింది. ఆమె అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్టు ఆమె పీఆర్‌ టీం తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్‌కు యత్నించారట.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 07:09 PM IST

MLC KAVITHA: టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ లాభం ఎంత జరుగుతుందో.. నష్టం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. సోషల్‌ మీడియా అకౌంట్లను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు వాళ్ల అవసరాలకు వాటిని వాడుకుంటున్నారు. కేవలం సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులకు కూడా ఈ సైబర్‌ ప్రమాదాలు తప్పడంలేదు. ప్రత్యేకంగా తెలంగాణ విషయానికే వస్తే.. తెలంగాణలో పొలిటికల్‌ లీడర్ల సోషల్‌ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్‌ అవుతున్నాయి.

YS SHARMILA: పెద్ద ప్లానే.. ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ తెలిస్తే షాక్.. షర్మిలతో మాములు గేమ్ కాదుగా..

ఎవరు టార్గెట్‌ చేస్తున్నారు.. ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు అన్న విషయాలు తెలియదు కానీ వరుసగా తెలంగాణ పొలిటీషియన్స్‌‌ను టార్గెట్‌ చేస్తున్నారు. వాళ్ల అకౌంట్లలో సంబంధం లేని ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. రీసెంట్‌గానే మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు కొందరు వ్యక్తులు. అందులో బీజేపీ, టీడీపీకి సంబంధించిన కొన్ని పోస్టులు పెట్టారు. ఈ ఘటన జరిగిన తరువాతి రోజే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ట్విటర్‌ అకౌంట్‌ కూడా హ్యాక్‌ అయ్యింది. ఆమె ప్రొఫైల్‌ నుంచి ప్రొఫైల్‌ పిక్చర్‌, బ్యానర్‌ను డిలీట్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన రాజ్‌భవన్‌ వర్గాలు.. దర్యాప్తు ప్రారంభించాయి. ఈ రెండు ఘటనలు మరువక ముందే ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవిత అకౌంట్‌ కూడా హ్యాక్‌ అయ్యింది. ఆమె అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసినట్టు ఆమె పీఆర్‌ టీం తెలిపారు.

సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్‌కు యత్నించారట. అనుమానాస్పదంగా లాగిన్ అయిన దుండగులు.. కవిత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఓ వీడియోలను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా టీంకు సమాచారం అందించారు. వాళ్లు ఆ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో రికవర్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.