Moinabad Farmhouse MLA’S: ఆ నలుగురూ ఓడిపోయారు.. మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ ఎమ్మెల్యేలంతా ఓటమి..

మొయినాబాద్‌లో ఉన్న ఫాంహౌజ్‌కు స్వామీజీలను రమ్మని చెప్పి.. సీసీ కెమెరాల్లో సీన్‌ మొత్తం రికార్డ్‌ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని లేపింది. కేసు నడుస్తుండగా వీడియోలు రిలీజ్‌ చేసినందుకు కేసీఆర్‌ మీద కూడా హైకోర్ట్‌ అసహనం వ్యక్తం చేసింది.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 06:27 PM IST

Moinabad farmhouse MLA’S: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఘటనల్లో మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ కేసు ఒకటి. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ వీడియోలు రిలీజ్‌ చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు.. ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు.

CONGRESS: కాంగ్రెస్‌లో సస్పెన్స్‌.. సీఎం ప్రకటన ఇవాళ లేనట్టే..

మొయినాబాద్‌లో ఉన్న ఫాంహౌజ్‌కు స్వామీజీలను రమ్మని చెప్పి.. సీసీ కెమెరాల్లో సీన్‌ మొత్తం రికార్డ్‌ చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని లేపింది. కేసు నడుస్తుండగా వీడియోలు రిలీజ్‌ చేసినందుకు కేసీఆర్‌ మీద కూడా హైకోర్ట్‌ అసహనం వ్యక్తం చేసింది. అయితే బీఆర్‌ఎస్‌ చేసిన ఆరోపణలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పి కొట్టింది. ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని తామెందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. కావాలని బీజేపీని ప్రజల ముందు దోషిగా చూపించేందుకు కేసీఆర్‌ డ్రామా ఆడుతున్నారంటూ చెప్పారు. ఎమ్మెల్యేలను లాక్కోవాలి అనుకుంటే.. డబ్బు తీసుకోకుండానే బీజేపీలోకి వచ్చేందుకు బీఆర్‌ఎస్‌లో చాలా మంది రెడీగా ఉన్నారంటూ చెప్పారు. పెద్దగా పేరులేని ఈ నలుగురితో మేమేం చేసుకుంటామంటూ పరువు తీశారు.

వచ్చే ఎన్నికల్లో వాళ్లు గెలుస్తారరో లేదో కూడా డౌటే అన్నారు. సంజయ్‌ నార్మల్‌గా అన్నారో సీరియస్‌గా అన్నారో తెలియదు కానీ.. ఆయన చెప్పినట్టే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో బీజేపీ చెప్పింది నిజమే అనే టాక్‌ మొదలైంది. ఆ రోజు బీజేపీని దోషిని చేయాలనుకున్న పాపమే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు తగిలిందనే వాదన మొదలయ్యింది. శాపమో.. పాపమో.. పక్కన పెడితే సమీప ప్రత్యర్థుల చేతిలో కోలుకోలేని స్థాయిలో ఓడిపోయారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు.