టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. ఇటీవల వైసీపీకి & రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణా రావు… టీడీపీలో చేరే అంశంపై స్పష్టత రాలేదు. ఇప్పటికే తన కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించిన మోపిదేవి…ఎందుకు పార్టీ మారుతున్నది వివరించారు.
ఈ నెల 9వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో మోపిదేవి వెంకట రమణ టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా బీదా మస్తాన్ రావు, మరో మాజీ ఎమ్మెల్సీ కూడా జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే తాను పార్టీ మారుతున్నా అని అనుచరులకు మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు.