అరెస్ట్‌పై సినిమా ? నోటీసులు, అరెస్ట్‌పై RGV సినిమా!

నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది. ఈ డైలాగ్‌ పవన్‌ కళ్యాణ్‌ కంటే ఆర్జీవీకి బాగా సెట్‌ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవి చేసే ప్రతి పని అందరికీ తిక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్‌ కూడా చెప్పి తన తిక్కకు ఓ లెక్క కూడా ఉందని చెప్పేలా స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటాడు ఆర్జీవీ.

  • Written By:
  • Publish Date - December 2, 2024 / 04:41 PM IST

నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది. ఈ డైలాగ్‌ పవన్‌ కళ్యాణ్‌ కంటే ఆర్జీవీకి బాగా సెట్‌ అవుతుంది. ఎందుకంటే ఆర్జీవి చేసే ప్రతి పని అందరికీ తిక్కలాగే కనిపిస్తుంది. కానీ తాను ఆ పని ఎందుకు చేశాడో ఓ లాజిక్‌ కూడా చెప్పి తన తిక్కకు ఓ లెక్క కూడా ఉందని చెప్పేలా స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటాడు ఆర్జీవీ. అందుకే ఎప్పుడు చూసినా అతని చుట్టూ వివాదాలు నెలకొనే ఉంటాయి. ఒకవేళ అలా జరగపోతే వివాదాలు వెతుక్కుంటూ ఆయనే వెళ్తాడు. ఏది ఏమైనా.. ఎప్పుడు చూసినా కాంట్రవర్సీల మధ్య కనిపిస్తూ ఉంటాడు వర్మ. అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న భయంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయనను అభిమానించే వాళ్ళు మాత్రం ఆయన దర్జాగా తిరుగుతున్నాడు అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు అని చెప్తున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌లను ఉద్దేశిస్తూ ఆర్జీవి ఒక సినిమా తీశాడు. ఆ సినిమా తీసిన సమయంలో చంద్రబాబు, లోకేష్ లను కించపరిచేలా కొన్ని పోస్టులను కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశాడు. ఆర్జీవీ పెట్టిన పోస్ట్‌ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రీసెంట్‌గా ఆర్జీవి మీద పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణకు రావాలంటూ పోలీసులు ఆర్జీవికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఆర్జీవీ మాత్రం విచారణకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిల్‌ కూడా దాఖలు చేశారు. ఓ పక్క పోలీసులు ఆయన కోసం వెతుకుతుంటే వర్మ మాత్రం టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతున్నారు. ఇదే క్రమంలో ఆర్జీవికి సంబంధించి ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం తనను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి రావడం తాను ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరగడం ఇవన్నీ కలిపి ఆర్జీవీ త్వరలోనే ఓ సినిమా తీయబోతున్నారట. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం పక్కన పెడితే.. తీస్తే బాగుంటుందని చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. మరి నిజంగానే ఆర్జీవి అంత పని చేస్తారా లేదా చూడాలి.