Political celebrities Voted : తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేసిన సినీ తారలు.. రాజకీయ ప్రముఖులు

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కువ వినియోగించుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది. తెలంగాణలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కువ వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైన నేపథ్యంలో జూబ్లీహిల్స్‎లో ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన సతీమణితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగి మాజీ మంత్రి కిషన్ రెడ్డి తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా తన భార్య ప్రణితతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లూ అర్జున్ కూడా తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీ లోని పోలింగ్ బూత్ 341 ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. ఉమెన్ కోపేరేటివ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ కేంద్రం లో లో ఓటు హక్కు వినియోగించుకున్న నాగ చైతన్య. టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు తన హోటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

Suresh SSM