MUDRAGADA PADMANABHAM: ముద్రగడ యూటర్న్ వెనక.. ఏం జరిగిందో తెలుసా..?

వచ్చే ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీ నుంచి వైసీపీ తరపున పోటీ చేయడం ఖాయమనే చర్చ జరిగింది. దాదాపు ముద్రగడ ఫ్యామిలీకి అంతా లైన్ క్లియరనే అనుకున్నారు. కానీ ఇంతలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. ముద్రగడ దగ్గరకు జనసేన నేతలు వెళ్లారు.

  • Written By:
  • Publish Date - January 12, 2024 / 03:23 PM IST

MUDRAGADA PADMANABHAM: టీడీపీని, చంద్రబాబును బద్ధశత్రువులుగా చూసిన ముద్రగడ పడ్మనాభం (MUDRAGADA PADMANABHAM) సడెన్‌గా రూట్ ఎందుకు మార్చారు..? వైసీపీ (YSRCP) వైపు వెళ్తున్న ముద్రగడ బస్.. ఒక్కసారిగా జనసేన, టీడీపీ వైపు ఎందుకు మళ్లింది..? వైసీపీతో ఎక్కడ బెడిసి కొట్టింది..? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. ఎవ్వరూ ఊహించని విధంగా ముద్రగడ టీడీపీ – జనసేన కూటమి వైపు అడుగులేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.
ముద్రగడ పద్మనాభం.. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేసిన ఆందోళనలు 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. టీడీపీ ఓటమికి ముద్రగడ చేసిన ఉద్యమం కూడా ఓ కారణం. ఇక ఉద్యమంలో చంద్రబాబు ప్రభుత్వం తనను.. తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెట్టిందనే విషయాన్ని చాలా సందర్భాల్లో ముద్రగడ తన లేఖల ద్వారా గుర్తుచేస్తూనే ఉన్నారు. అలాగే 2019 తర్వాత కాపు ఉద్యమం, కాపు రిజర్వేషన్ల గురించి గతంలో మాదిరిగా పెద్దగా ఉద్యమించింది లేదు. దీంతో ముద్రగడ.. ఆయన కుటుంబం నెమ్మదిగా వైసీపీకి ట్యూన్ అవుతున్నారనే అంతా భావించారు. దీనికి తగ్గట్టే.. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముద్రగడ ఫ్యామిలీ కూడా వైసీపీ వైపు అడుగులు వేస్తున్నట్టే కన్పించింది.

YSRCP LIST: ఫోర్త్ లిస్ట్ టెన్షన్.. ఏ నిమిషానికి ఏమి జరుగునో !

వచ్చే ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీ నుంచి వైసీపీ తరపున పోటీ చేయడం ఖాయమనే చర్చ జరిగింది. దాదాపు ముద్రగడ ఫ్యామిలీకి అంతా లైన్ క్లియరనే అనుకున్నారు. కానీ ఇంతలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. ముద్రగడ దగ్గరకు జనసేన నేతలు వెళ్లారు. పార్టీలోకి ఆహ్వానించారు. కలిసి పని చేద్దామనే ఆఫర్ ఇచ్చారు. అంతే కాకుండా టీడీపీ నుంచి కాపు నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడను కలిశారు. అయితే ముద్రగడను కలవాలనుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును తన ఇంటికి రావొద్దని.. వైసీపీకి తన ఇంటి తలుపులు తెరుచుకోవనే రీతిలో సంకేతాలు పంపారు. వైసీపీకి, తనకు సెట్ కాదనే తోట త్రిమూర్తులుకు ముద్రగడ చెప్పేసినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది. దీంతో అందరిలోనూ ఒకటే షాక్. ముద్రగడ ఈ స్థాయిలో యూ టర్న్ ఎందుకు తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో వైసీపీతో అసలు ఎందుకు చెడిందనే డౌట్లూ వస్తున్నాయి. టిక్కెట్ల దగ్గర జరిగిన పంచాయతీ కారణంగానే వైసీపీతో ముద్రగడ వ్యవహరం బెడిసి కొట్టిందనే చర్చ నడుస్తోంది. వైసీపీ వైపు నుంచి ఓ ఎమ్మెల్యే టిక్కెట్టుతో పాటు రాజ్యసభ స్థానాన్ని కూడా ఆశించినట్టు సమాచారం.

Pawan Kalyan : ఏపీలో పవన్ కళ్యాణ్ ఓటుకి గండం..!

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ సాధ్యం కాదని ముద్రగడకు వైసీపీ స్పష్టం చేసిందట. అందుకే వైసీపీలో చేరేంత వరకు వచ్చిన ముద్రగడ ఫ్యామీలీ.. సడన్‌గా యూ టర్న్ తీసుకుని జనసేన వైపు అడుగులేయడానికి సిద్ధపడ్డట్టు తెలుస్తోంది. తాను చేసిన ఉద్యమం వల్ల వైసీపీకి బాగా కలిసొచ్చిందనే భావనలో ముద్రగడ ఉన్నారనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో జనసేనను కూడా కాదని.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి అన్ని సీట్లు రావడానికి ఓ విధంగా తానే కారణమని ముద్రగడ అంచనా వేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాను అడిగిన విధంగా రాజ్యసభ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలోకి వెళ్లడానికి ఇష్టపడక.. వేరే పార్టీల వైపు ముద్రగడ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ముద్రగడ తన ఇంటి తలుపులు వైసీపీకి మూసేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారనే చెప్పాలి. ఆయన ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని వైసీపీ నేతలే కాదు.. జనసేన, టీడీపీ నేతలు కూడా ఊహించలేదని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఇంకెన్ని షాకులు తినాల్సి వస్తోందోననే చర్చ జరుగుతోంది.