MUDRAGADA PADMANABHAM: పిఠాపురం నుంచి పవన్‌ పోటీ.. వైసీపీ ముద్రగడను దింపబోతోందా ?

పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఐతే పవన్‌కు పోటీగా వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో.. పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వంగా గీతను నియమించారు.

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 05:17 PM IST

MUDRAGADA PADMANABHAM: పవన్‌ కల్యాణ్ పోటీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ పవన్ చెప్పాడు స్వయంగా ! దీంతో పిఠాపురంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఐతే పవన్‌కు పోటీగా వైసీపీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో.. పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వంగా గీతను నియమించారు.

RAM GOPAL VARMA: పిఠాపురంలో పవన్‌పై పోటీగా ఆర్జీవీ.. వైసీపీ అభ్యర్థా..?

ఈ లెక్కన పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీతనే పోటీ చేయాలి. ఐతే ఆ మధ్య జరిగిన పరిణామాలు.. ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయ్. వంగా గీతను పిలిపించిన సీఎం జగన్‌.. కీలక చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. పవన్‌ పోటీపై క్లారిటీ వస్తే.. గీతను ఇంచార్జిగా మార్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపించింది. దీంతో ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఎవరు అనే టెన్షన్‌.. మళ్లీ మొదలైంది. పవన్‌ మీద, జనసేన మీద పీకల్లోతు కోపంతో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ.. వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఐతే ఆయనకు కానీ.. ఆయన కుటుంబం నుంచి ఒకరికి కానీ.. పిఠాపురం టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే స్థానం బదులు.. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలని జగన్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల విషయంలో కాపులంతా.. పవన్ మీద కోపంగా ఉన్నారు.

ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలంటే.. ముద్రగడను బరిలో దింపడం బెటర్ అని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 16న అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను జగన్‌ ప్రకటించబోతున్నారు. దీంతో పిఠాపురం అభ్యర్థి ఎవరనేది మరింత ఆసక్తి రేపుతోంది. పవన్‌ మీద పోటీ చేయబోయేది.. ముద్రగడ ఫ్యామిలీనా.. లేదంటే వంగా గీతానే బరిలో ఉంచుతారా అనే క్యూరియాసిటీ రాజకీయవర్గాలతో పాటు జనాల్లో కనిపిస్తోంది.