ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్య కాదు. చంపేశారు. కట్నం కోసం వేధించి అత్యంత దారుణంగా చంపేశారు. శృతి ఆత్మహత్య గురించి వాళ్ల తల్లిదండ్రులు చేస్తున్న అరోపణలు ఇవి. అసలు శృతి కేసులో ఏం జరిగింది. పెద్దలను కాదని లవర్‌ను పెళ్లి చేసుకున్న 20 రోజులకే ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం ఆ అమ్మాయికి ఏమొచ్చింది. శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని అంతా చెప్తున్నా.. తన ప్రాణాన్ని తానే తీసుకునే నిర్ణయం శృతి ఎందుకు తీసుకుంది. ఆ అమ్మాయి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా లేక వాళ్ల అమ్మానాన్న చెప్తున్నట్టు శృతిని చంపేశారా. అసలు ఈ కేసులో మిస్టరీ ఏంటి. నేను మీ ప్రవీణ్ భగత్ లెట్స్ హావ్ ఎ లుక్.
శృతిది నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ విలేజ్. చిన్నప్పటి నుంచీ ఆమెకు జానపదాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సింగర్‌గా మారింది. పాటల మీద మంచి పట్టు సాధించిన ప్రొఫెషనల్ సింగర్ అయ్యింది. ఫోక్ సాంగ్స్, ఆల్బమ్స్ చేసేందుకు ఈవెంట్స్ చేసేందుకు హైదరాబాద్‌లో ఉంటే బెటర్ అని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. ఇక్కడికి వచ్చిన తరువాత శృతికి ఇన్‌స్టాగ్రామ్‌లో దయాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు ఆ పరిచయం ప్రేమగా మారింది. దయాకర్‌ది సిద్దిపేట్ జిల్లాలో ఉన్న పీర్లపల్లి విలేజ్. దయాకర్‌ను కలవడానికి శృతి రెగ్యులర్‌గా పీర్లపల్లికి వెళ్లేది. వీళ్ల వ్యవహారం దయాకర్ ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు.
రీసెంట్‌గా తన లవ్ మ్యాటర్ తన ఇంట్లో చెప్పింది శృతి. ఇంట్లోవాళ్లు కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు, పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ పెళ్లి ఫిక్స్ చేసుకున్న తరువాత దయాకర్‌కు కట్నం ఇవ్వాలంటూ వాళ్ల పేరెంట్స్ డిమాండ్ చేశారని శృతి తండ్రి చెప్తున్నాడు. ఇదే విషయం శృతి తండ్రి ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి ఏం అర్థం చేసుకుందో తెలియదు కానీ.. చెప్పా పెంట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 20 రోజలు క్రితం లవర్‌ను పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి శృతి పేరెంట్స్ పోలీస్ కేస్ కూడా పెట్టారు. కానీ శృత మాత్రం భర్తతోనే ఉండేందుకు డిసైడ్ అయ్యింది. చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో శృతి లేకపోవడంతో వాళ్ల పేరెంట్స్ కూడా సైలెంట్ అయిపోయారు. కట్ చేస్తే అత్తింట్లో ఫ్యాన్‌కు శృతి శవమై కనిపించింది.
శృతి ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదు తనను ఖచ్చితంగా ఏదో చేశారు అని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చెప్తున్నారు. కట్నం కోసమే తన కూతుర్ని చంపేశారు అని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటన్నిటికంటే మించి.. శృతి డెడ్‌బాడీ అనేక అనుమానాలకు కారణం అవుతోంది. ఉరి వేసుకుంటే ఖచ్చితంగా మెడ మీద బలమైన మరకలు ఉండాలి.. నాలుక బయటకు వచ్చి ఉండాలి. కానీ శృతి బాడీ మాత్రం అలా లేదు. దీంతో పాటు శృతి ఏ ఫ్యాన్‌కు ఉరి వేసుకుందో ఆ ఫ్యాన్ చాలా నీట్‌గా ఉంది. నిజానికి ఒక మనిషి బాడీని మోసిన ఫ్యాన్ వంగిపోయి ఉండాలి. కానీ శృతి ఉరి వేసుకున్న ఫ్యాన్‌కు కనీసం దుమ్ము కూడా పోలేదు. సో ఖచ్చితంగా నా కూతుర్ని చంపి ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నారు అనేది శృతి తండ్రి చేస్తున్న ఆరోపణ. కేసులో చాలా మంది మీద అనుమానాలు ఉన్నా.. ఎవరినీ నిందితులుగా చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు. సస్పెక్ట్ డెత్‌కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. తన పాటలతో ఎంతో మందిలో ఉత్సాహం నింపిన శృతికి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందాం.
ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్య కాదు. దారుణంగా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. శృతి మరణం గురించి ఆమె పేరెంట్స్ చేస్తున్న ఆరోపణ ఇది. వాళ్లు చెప్తున్నది ఏంటి అంటే.. శృతి దయాకర్ అనే అబ్బాయిని ప్రేమించింది. వాళ్ల పెళ్లికి పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. కానీ దయాకర్ ఫ్యామిలీకి అమ్మాయికంటే కట్నం ముఖ్యమని తెలిసి శృతికి వాళ్ల తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ శృతి మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయి దయాకర్‌ను పెళ్లి చేసుకుంది. ఇది జరిగిన 20 రోజులకే శృతి ఇంట్లో ఫ్యాన్‌కు శవమై కనిపించింది. అత్తింటివాళ్లే కట్నం కోసం చంపేశారు అనేది శృతి తల్లిదండ్రులు చేస్తున్న అరోపణ. శృతి డెడ్‌బాడీ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు లేదని వాళ్ల ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఎవరో చంపేసి ఫ్యాన్‌కు వేలాడదీశారని అంటున్నారు. దీంతో అనుమానాలు చాలా మందిపై ఉన్నా.. ఆధారాలు మాత్రం లేవు. దీంతో సస్పెక్ డెత్ కింద కేసు నమోదు చేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. తన సాంగ్స్‌తో ఎంతో మందిని అలరించిన శృతికి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం.