వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రభుత్వాలకు దగ్గరగా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా రాజకీయ లక్ష్యాలకు వ్యాపారవేత్తలు బలయ్యే ఛాన్స్ పక్కగా ఉండవచ్చు. ఇప్పుడు అక్కినేని నాగార్జున పరిస్థితి అలాగే ఉంది. ఏపీలో జగన్ తో… తెలంగాణాలో కేటిఆర్ తో ఆయన చేసిన స్నేహం ఇప్పుడు ఆయన వ్యాపారాలకు సమస్య అనే టాక్ వస్తోంది. ఇటీవల ఎన్ కన్వెన్షన్ విషయంలో జరిగింది ఫ్యూచర్ లో ఎక్కడైనా జరగవచ్చు అని మరికొన్ని వ్యవహారాల మీద ఫోకస్ చేసారు అనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇప్పుడు నాగార్జునకు మరో సమస్య కూడా ఉంది. తన కుమారుడు, హీరో నాగ చైతన్య పెళ్లిని అన్నపూర్ణ స్టూడియో లో గ్రాండ్ గా చేస్తున్నాడు. ఈ ఈవెంట్ కు ఎవరు వస్తారు అనేది ఇప్పుడు అర్ధం కాని పరిస్థితి నాగార్జునది. ఏపీలో నాగార్జునకు వ్యాపారాలు ఉన్నాయి. కాని సినీ రాజకీయ ప్రముఖులను పిలవాల్సిన పరిస్థితి. అలాగే తెలంగాణాలో కూడా. ఆయనకు కేటిఆర్ కు మధ్య మంచి స్నేహం ఉంది. గత పదేళ్ళ నుంచి ఈ స్నేహం బాగా బలపడింది. వీళ్ళు ఇద్దరూ బిజినెస్ పార్టనర్ లు అనే టాక్ కూడా ఉంది.
ఈ సమయంలో అసలు కొడుకు పెళ్ళికి ఎవరిని పిలవాలి అనేది నాగార్జునకు అర్ధం కాని పరిస్థితి. కేటిఆర్ ను పిలిచి రేవంత్ ను పిలవకపోతే ఇబ్బంది రావచ్చు. రేవంత్ వస్తే కేటిఆర్ రాకపోవచ్చు. రేవంత్ ను ఇన్వైట్ చేసినా వస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇంత జరిగిన తర్వాత రేవంత్ ను ఇన్వైట్ చేస్తే అది కాళ్ళ బేరానికి వచ్చినట్టు అవుతుంది అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఆ భయమే నాగార్జునను వెంటాడుతుంది. రేవంత్ కాస్త మొండిరకం. ముందు నుంచి ఎన్ కన్వెన్షన్ విషయంలో ఆయన సీరియస్ గానే ఉన్నారు.
అందుకే హైడ్రా దాన్ని ఏ మాత్రం ఆలోచన లేకుండా నాగార్జునకు సెకండ్ ఆప్షన్ ఇవ్వకుండా కూల్చింది. కచ్చితంగా రేవంత్ కు నాగార్జున విషయంలో కోపం ఉండవచ్చు. అందుకే ఇప్పుడు నాగార్జున… రేవంత్ ను పిలుస్తారా… అసలు కాంగ్రెస్ వాళ్లకు ఎవరికి అయినా ఆహ్వానం ఉంటుందా లేదా అనేది అర్ధం కాని పరిస్థితి. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే ఛాన్స్ ఉంది. ముందు ఇతర రాష్ట్రాల్లో చేయాలి అనుకున్నా కొన్ని కారణాలతో హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. చూద్దాం మరి రేవంత్ రెడ్డి హాజరు అవుతారా లేదా అనేది.