Nandamuri Balakrishna: బాలకృష్ణకు టీడీపీ పగ్గాలు.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే బెటర్ ఆప్షనా..?

మరోవైపు చంద్రబాబే కాదు.. లోకేశ్‌ కూడా జైలుకు వెళ్తారంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. సీఐడీ కూడా అదే చెబుతోంది. నిజంగా అదే జరిగితే.. టీడీపీ పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 04:32 PM IST

Nandamuri Balakrishna: ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి! రాజకీయం ఎప్పుడు, ఏ మలుపు తీసుకుంటుందో.. ఏ మలుపు.. ఏ తీరానికి చేరుతుందో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో వైసీపీకి దీటుగా టీడీపీ, జనసేన పోటీ ఇస్తాయి.. ఏకం అవుతాయి.. రాజకీయం మరింత రసవత్తరంగా మారతుంది.. అనుకుంటున్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పాలిటిక్స్‌ను మరింత పాకాన పడేలా చేశాయి. మరోవైపు చంద్రబాబే కాదు.. లోకేశ్‌ కూడా జైలుకు వెళ్తారంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.

సీఐడీ కూడా అదే చెబుతోంది. నిజంగా అదే జరిగితే.. టీడీపీ పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. చంద్రబాబు అరెస్ట్, అసలే ఎన్నికల సమయం కావడంతో.. పొలిటికల్ లెక్కలు వేగంగా మారుతున్నాయి. లెక్క తీసి కొడితే.. ఏపీలో ఎన్నికలకు గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేదు. ఇలాంటి తరుణంలో.. చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు పార్టీ పగ్గాలు, బాధ్యతలు బాలకృష్ణకు అప్పగిస్తే బాగుంటుందనే కామెంట్లు జనాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మధ్యే పార్టీ ముఖ్య నేతలతో బాలకృష్ణ సమావేశం అయ్యారు. చంద్రబాబు ఎప్పుడూ కూర్చునే కుర్చీలో కూర్చున్న బాలయ్యను చూసి.. టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక అటు బాలకృష్ణ కూడా పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది.

బాలయ్య చేతికి పార్టీ బాధ్యతలు వస్తే.. టీడీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. లోకేశ్‌కు పొలిటికల్‌గా సరైన అనుభవం లేదు. దీంతో బాలయ్యే టీడీపీ పగ్గాలు చేపట్టే సరైన నాయకుడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం పాటు బాలయ్య సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు, నందమూరి అభిమానులు కోరుతున్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని అంటున్నారు. ఇక అటు వైసీపీ మీద బాలయ్య కూడా స్ట్రాంగ్‌ కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ బాధ్యతలు మోస్తూ.. ఇదే జోష్ కంటిన్యూ చేస్తే వైసీపీని దెబ్బతీయడం పెద్ద మ్యాటర్ కాదు అన్నది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న చర్చ.