ఏపీ రాజకీయాల్లో (AP Politics) గుడివాడ (Gudivada) రాజకీయం వేరు. 20 ఏళ్లుగా.. వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానిని (Kodali Nani).. గుడివాడలో ఓడించాలన్నది ప్రతీ టీడీపీ (TDP) కార్యకర్త కల. ఆ మధ్య అసెంబ్లీ ఎపిసోడ్ తర్వాత.. టీడీపీ కూడా ఇదే పట్టు మీద కనిపించింది. గుడివాడలో కొడాలి నాని ఓడించి తీరాలని వ్యూహాలు రచించింది. ఐతే ఇప్పుడు అదే జరగబోతుందా అంటే.. గుడివాడలో కొడాలి నాని ఓటమి ఖాయమా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కొడాలి నానిని ఓడించి.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము (Venigandla Ramu) కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అనే టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
వార్ వన్‌సైడ్ కావడం ఖాయమని.. ఓటర్లంతా ఒకేవైపు ఉన్నారని.. కొడాలి నాని దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ కావడం ఖాయం అంటూ.. గుడివాడలో టాక్ వినిపిస్తోంది. పోలింగ్ ట్రెండ్స్ చూస్తే.. నాని ఓటమి కన్ఫార్మ్‌గా కనిపిస్తోంది. మెజారిటీ మండలాల్లో టీడీపీకే ఓట్లు వెళ్లినట్లు తెలుస్తోంది. గుడివాడ టౌన్, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు భారీగా ఓట్లు పోల్ అయినట్లు టాక్. కేవలం నందివాడ మండలంలో మాత్రమే కొడాలి నానికి ఎక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. గుడివాలో కమ్మ ఓటర్లు గేమ్‌ఛేంజర్ అయినా.. ఆ తర్వాత కీలకంగా ఉన్న కాపు సామాజికవర్గం నుంచి 30వేలకు పైగా ఓట్లు టీడీపీ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలిచిన కొడాలి నానికి.. ఈసారి ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయ్. లేటెస్ట్ ట్రెండ్‌తో కొడాలి నాని వర్గం తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం. నిజానికి గత నాలుగు ఎన్నికల కంటే.. గుడివాడలో ఈసారి కొడాలి నాని ఎక్కువ కష్టపడ్డారు. 40రోజులు గుడివాడ దాటకుండా.. ప్రచారం నిర్వహించారు. నాని మాట తీరు కావొచ్చు.. వైసీపీ మీద వ్యతిరేకత కావొచ్చు.. కొడాలి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.
ఇక అటు కొడాలి నాని ఓడిపోతారంటూ.. భారీగా బెట్టింగ్‌లు కనిపిస్తున్నాయ్. నిజానికి ఓట్ల రోజు.. ప్రతీ పోలింగ్ కేంద్రం తిరిగిన కొడాలి నాని.. మునుపటి జోష్ కనిపించలేదు. సాయంత్రానికి ఓటు వేసిన తర్వాత కూడా.. పెద్దగా ఆయన మొహంలో ఉత్సాహం కనిపించలేదు. మంచి ప్రభుత్వానికే జనాలు ఓటు వేసి ఉంటారనుకుంటా అని ఒక్క ముక్కతో తన మాట ముగించారు. అంటే అప్పటికే ఆయనకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుందని.. ఓటమి ఖాయం అని ఫిక్స్ అయిపోయి ఉంటారంటూ.. ఇప్పుడో కొత్త చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.