Nara Bhuvaneshwari: రాజమండ్రిలోనే భువనేశ్వరి.. ములాఖత్‌ను తిరస్కరించిన జైలు అధికారులు..

రీసెంట్‌గానే ములాఖత్‌లో భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణిలను కలిశారు చంద్రబాబు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణను కూడా కలిశారు. ఓ సారి తన లాయర్‌తో ములాఖాత్‌లో మాట్లాడారు. ఇంతకు మించి ములాఖాత్‌కు అనుమతి ఇవ్వమంటూ అధికారులు చెప్తున్నారు.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 01:03 PM IST

Nara Bhuvaneshwari: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరికి అనుమతి నిరాకరించారు అధికారులు. చంద్రబాబును ములాఖత్‌లో కలుసుకునేందుకు భువనేశ్వరి ధరఖాస్తు చేస్తున్నారు. జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీకి వారంలో మూడు సార్లు మాత్రమే ములాఖాత్‌కు అవకాశం ఉంటుందని.. ఇప్పటికే మూడు సార్లు ములాఖాత్‌కు అనుమతిచ్చిన కారణంగా ఈ సారి అనుమతి రద్దు చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు.

రీసెంట్‌గానే ములాఖత్‌లో భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణిలను కలిశారు చంద్రబాబు. ఆ తరువాత పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌, బాలకృష్ణను కూడా కలిశారు. ఓ సారి తన లాయర్‌తో ములాఖాత్‌లో మాట్లాడారు. ఇంతకు మించి ములాఖాత్‌కు అనుమతి ఇవ్వమంటూ అధికారులు చెప్తున్నారు. దీంతో భువనేశ్వరి రాజమండ్రిలోనే చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూస్తున్నారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ములాఖాత్‌కు అనుమతినివ్వడంలేదంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గతంలో ఎంతో మంది ఖైదీలకు లెక్కకు మించి జైలు అధికారులు ములాఖాత్‌ ఇచ్చారని.. ఇప్పుడు చంద్రబాబుకు ఇవ్వడానికి సమస్యేంటని ప్రశ్నిస్తున్నారు. మానసికంగా మనిషిని దెబ్బతీసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులకు తాడేపల్లి నుంచి ఆదేశాలు అందుతున్నాయని.. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.