Nara Bhuvaneswari: భువనేశ్వరి సరదా కామెంట్స్.. బాబుని ఆటాడుకుంటున్న వైసీపీ !

35 యేళ్ళుగా చంద్రబాబుని కుప్పంలో గెలిపిస్తున్నారు.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం.. నేను నిల్చుంటా.. నన్ను గెలిపిస్తారా.. అంటూ సరదాగా మాట్లాడారు నారా భువనేశ్వరి. అంతే వైసీపీ లీడర్లు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ వైసీపీకి ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి.

  • Written By:
  • Updated On - February 22, 2024 / 01:44 PM IST

Nara Bhuvaneswari: చంద్రబాబు నాయుడి భార్య నారా భువనేశ్వరి మొన్నటిదాకా రాజకీయాల్లో కాలుపెట్టలేదు. కానీ బాబును రాజమండ్రి జైలుకి పంపిన తర్వాత ఆమె ఇప్పుడు జనంలో తిరుగుతున్నారు. నిజం గెలవాలి అనే పేరుతో పర్యటిస్తున్న భువనేశ్వరి.. లేటెస్ట్‌గా బాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సరదా కామెంట్స్ వైసీపీకి ప్రచార అస్త్రాలుగా మారిపోయాయి. 35యేళ్ళుగా మా వారిని గెలిపిస్తున్నారు.. ఈసారి నేను నిల్చుంటా.. గెలిపిస్తారా అని భువనేశ్వరి అనడంతో వైసీపీ నేతలకు కొత్త ఆయుధం దొరికింది. 35యేళ్ళుగా చంద్రబాబుని కుప్పంలో గెలిపిస్తున్నారు.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దాం.. నేను నిల్చుంటా.. నన్ను గెలిపిస్తారా.. అంటూ సరదాగా మాట్లాడారు నారా భువనేశ్వరి.

PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు

అంతే వైసీపీ లీడర్లు రెచ్చిపోయారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని నాలుగేళ్లుగా సవాల్ చేస్తున్నారు వైసీపీ పెద్దలు. ఇప్పుడు భవనేశ్వరి చేసిన కామెంట్స్‌ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మా చేతిలో ఓడిపోతానన్న భయంతోనే చంద్రబాబు కుప్పంలో పోటీ చేయట్లేదనీ.. ఆయన భార్యను నిలబెడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబుకి కుప్పంలో కూడా గెలవలేమని అర్థమైందని ఎద్దేవా చేశారు. ఇక సూటిపోటి మాటలతో బాబుని టార్గెట్ చేసే మరో మంత్రి అంబటి రాంబాబు అయితే.. బాబే కాదు.. భువనేశ్వరి నిలబడ్డా కుప్పంలో గెలవబోరని అన్నారు. ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఏదో రకంగా ఇరుకున పెడదాం అని ఆలోచిస్తున్నారు. వైసీపీ, టీడీపీ మధ్య ఇలాంటి మాటల యుద్ధం ఇప్పటికే పీక్ స్టేజ్‌కి చేరిపోయింది. అందుకే నారా భువనేశ్వరి అన్న సరదా మాటలను వైసీపీ తమ అస్త్రాలుగా మలుచుకుంది.

Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్‌

కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామనీ.. ఇప్పుడు భువనేశ్వరి కూడా అదే చెప్పారని కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబుకు రెస్ట్ తీసుకునే వయసొచ్చింది.. అందుకే భువనేశ్వరి కుప్పంలో పోటీకి ఆసక్తిగా ఉన్నారని విమర్శించారు రోజా. అంతేకాదు బాబు హయాంలో కుప్పంలో హంద్రీ నీవా నీళ్ళు రాలేదనీ.. ఇప్పుడు జగన్ ఇచ్చారని చెప్పారు. అంబటి కూడా భువనేశ్వరి కామెంట్స్‌ని బాబుపై ఎటాక్స్‌కి వాడేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. నరసరావుపేట వైసీపీ లీడర్ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఈ కామెంట్స్‌ను వాడుకున్నారు. రోజా, అంబటి, అనిల్.. ఇలా వరుసపెట్టి విమర్శలు చేస్తుంటే టీడీపీ కౌంటర్ ఇచ్చుకుంది.

భువనేశ్వరి సరదాగా అన్న మాటలతో దిగజారుడు రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు టీడీపీ లీడర్లు. కానీ సరదాగా అన్నా.. మరోటి అన్నా.. పాలిటిక్స్‌లో లీడర్లు మాత్రం జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. లేకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్థి పార్టీలు ఆడుకుంటాయని ఇప్పుడు ఏపీలో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.