Nara Brahmani: కోడలు అంటే ఇంటి పరువు మాత్రమే కాదు. బరువు బాధ్యతలు కూడా మోసే పెద్ద దిక్కు కూడా. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు.. కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చే తోడు. ఈ మాటలకు నారా వారి కోడలు బ్రాహ్మణి సరిగ్గా సరిపోతుంది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచీ ఎంతో బాధ్యతతో, ప్రతీ ఒక్కరికీ ధైర్యం చెప్తోంది బ్రాహ్మణి. వ్యాపారాన్ని పక్కన పెట్టి.. మామ కోసం రాజమండ్రిలోనే ఉంటోంది. ప్రతీ క్షణం భువనేశ్వరికి ధైర్యం చెప్తూ తోడుగా ఉంటోంది.
కుటుంబ సభ్యులే కాదు.. పార్టీ నేతలు కూడా ధైర్యం కోల్పోకుండా వాళ్ల మధ్యే ఉంటోంది బ్రాహ్మణి. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుతో జరిగిన ములాఖాత్‌లో బ్రాహ్మణికి చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలను సమన్వయం చేస్తూ పరిస్థితి కంట్రోల్ చేయాల్సిందిగా చంద్రబాబు బ్రాహ్మణికి చెప్పినట్టు తెలుస్తోంది. నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. బాలకృష్ణ.. తన బావను బయటికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంటిని చూసుకుంటూనే, కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు ఓ పెద్ద దిక్కు కావాలి. ఆ బాధ్యతను చంద్రబాబు, బ్రాహ్మణికి అప్పగించినట్టు తెలుస్తోంది. ముందు నుంచి రాజకీయాలకు దూరంగా ఉండే బ్రాహ్మణి ఇప్పుడు మాత్రం కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటోంది.
ప్రతీ నిరసన కార్యక్రమానికి వెళ్తోంది. చంద్రబాబుపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరును స్వయంగా ప్రతీ చోటా వివరిస్తోంది. వేరే పార్టీ రాజకీయ నేతలతో కూడా మీటింగ్‌లు నిర్వహిస్తోంది. కార్యకర్తలు సహనం కోల్పోకుండా, ధైర్యం కోల్పోకుండా వాళ్ల మధ్యే ఉంటూ మామకు తగ్గ కోడలు అనిపించుకుంటోంది.