Nara Brahmani: బ్రాహ్మణి పాదయాత్ర చేయబోతున్నారా..? ప్రచారంలో నిజమెంత..?

మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణి.. వైసీపీ సర్కార్, జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ అరెస్ట్‌ల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 03:05 PM IST

Nara Brahmani: చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మంచి థ్రిల్లర్‌ సినిమాలను తలపిస్తున్నాయ్ అక్కడి పాలిటిక్స్ ! ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి మలుపు కనిపిస్తుందో.. ఆ మలుపు గమ్యం ఎక్కడికో అర్థం కాని పరిస్థితి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అవుతుందా.. వైసీపీకి మైలేజ్ తెస్తుందా అన్న సంగతి పక్కనపెడితే.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నందమూరి, నారా కుటుంబాల్లో ఆసక్తికర పరిణామాలకు కారణం అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయినా.. ఎన్టీఆర్ ఇప్పటికీ రియాక్ట్ అవలేదు.

ఇదంతా ఎలా ఉన్నా.. నారా వారి కోడలు బ్రాహ్మణి.. రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు నెమ్మదిగా! మొన్న రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిర్వహించిన క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణి.. వైసీపీ సర్కార్, జగన్ తీరు మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఈ అరెస్ట్‌ల పరంపర చంద్రబాబుతోనే ఆగే అవకాశాలు కనిపించడం లేదు. ఫైబర్ నెట్ స్కామ్‌లో లోకేశ్‌ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ మంత్రులు ఇదే విషయంపై బహిరంగంగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య లోకేశ్‌ ఢిల్లీ వెళ్లి మకాం వేయడంతో.. అరెస్ట్ వ్యవహారం నిజమే అనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు నుంచి.. యువగళం పాదయాత్రకు లోకేశ్‌ బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం.. ఇప్పట్లో పాదయాత్ర మొదలుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తోంది.

ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు తర్వాత లోకేశ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు కూడా అంచనా వేస్తుండడంతో బ్రాహ్మణి పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్. లోకేశ్ అరెస్ట్ జరిగితే.. జగన్‌ ఫార్ములానే టీడీపీ ఫాలో అయ్యే చాన్స్ ఉంది. గతంలో జగన్ 16నెలల జైలులో ఉన్న సమయంలో.. జగన్ బ్రేక్ ఇచ్చిన పాదయాత్రను ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కొనసాగించారు. ఇప్పుడు అదే విధంగా.. లోకేష్ మధ్యలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను బ్రాహ్మణి పూర్తి చేస్తారని.. ఆమెతో పాటు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యువగళం పేరుతో దాదాపు 2వందల రోజులకు పైగా లోకేష్ యాత్ర పూర్తిచేశారు. ఇంకా లోకేష్ పాదయాత్ర చేయాల్సిన ప్రాంతాల్లో.. బ్రాహ్మణి ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. టీడీపీకి మహిళల నుంచి మరింత ఆదరణ పెరుగుతుందని.. తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.