NARA LOKESH: అమెరికాలో నారా లోకేష్ అరెస్టు.. అసలు నిజం ఏంటి..?

నారా లోకేష్.. కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. దీంతో లోకేష్ అమెరికాలో అరెస్టయ్యాడంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 04:50 PM IST

NARA LOKESH: టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. దీంతో లోకేష్ అమెరికాలో అరెస్టయ్యాడంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే.. ఇటీవలి కాలంలో లోకేష్ మీడియా ముందుకు, జనం ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రచారం నిజమేనా..? నారా లోకేష్ నిజంగానే అమెరికాలో అరెస్టయ్యాడా..?

Chandrababu VS Pawan Kalyan : బాబు పొత్తుధర్మం పాటించట్లేదు.. టీడీపీకి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

అనే అనుమానాలు సామాన్యుల్లో కనిపిస్తున్నాయి. అయితే, దీనికి టీడీపీ సోషల్ మీడియా సమాధానమిచ్చింది. ఈ ప్రచారంలో నిజం లేదని, హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్నారని టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు నారా లోకేష్ పాల్గొన్న ఒక ఫొటోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో నిధుల సేకరణ, ఇండియాకు తరలించేందుకు నారా లోకేష్ అమెరికా వెళ్లాడని, అక్రమ లావాదేవీలకు సంబంధించి అక్కడి పోలీసులు నారా లోకేష్‌ను అరెస్టు చేశారని వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది. దీనిపై ఇండియన్ ఎంబసీకి సమాధానం అందిందని, పోలీసులు లోకేష్‌ను గట్టిగా విచారిస్తున్నారని తమ సోషల్ మీడియా పోస్టుల్లో వైసీపీ అభిమానులు పేర్కొంటున్నారు. దీంతో స్పందించిన చంద్రబాబు.. తన కుమారుడు లోకేష్‌ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ మీడియా చెప్పుకొచ్చింది.

ఈ విషయం బయటకు రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం చేసింది. అయితే, తాజాగా.. టీడీపీ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రచారంపై స్పష్టతనిచ్చింది. లోకేష్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు.. లోకేష్ కూడా వరుసగా పలు అంశాలపై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.