NARA LOKESH: చంద్రబాబు రికార్డ్‌ బ్రేక్‌ చేసిన లోకేశ్‌.. టీడీపీ శ్రేణుల సంబరాలు..!

లోకేశ్ యువగళానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తన అడుగులతో లోకేశ్ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్‌ చేశాడు. చంద్రబాబు రికార్డును అధిగమించారు. 2012లో 208 రోజుల్లో చంద్రబాబు.. 2వేల 817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేయగా.. 206 రోజుల్లో లోకేష్ 2వేల 817 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుని పార్టీ శ్రేణులతో ఔరా అనిపించారు.

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 07:34 PM IST

NARA LOKESH: ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నా.. ఏపీలో పార్టీలన్నీ ఇప్పటి నుంచే జనాల్లో కనిపిస్తున్నాయి. లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే.. చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధం అయ్యారు. పవన్‌ వారాహి యాత్ర మళ్లీ మొదలు కాబోతోంది. ఇక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ జగన్ కూడా జనాల్లోనే ఉంటున్నారు. టీడీపీ అయితే మరింత జోష్‌ మీద కనిపిస్తోంది. తండ్రీకొడుకులు ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. లోకేశ్‌ పాదయాత్రకు ఆరంభంలో సోసో రెస్పాన్స్ కనిపించినా ఇప్పుడు జోరందుకుంది. ఒక్కో అడుగు వేస్తున్న లోకేశ్‌.. జనాల్లోకి దూసుకుపోతున్నారు.

లోకేశ్ యువగళానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తన అడుగులతో లోకేశ్ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్‌ చేశాడు. చంద్రబాబు రికార్డును అధిగమించారు. 2012లో 208 రోజుల్లో చంద్రబాబు.. 2వేల 817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను పూర్తి చేయగా.. 206 రోజుల్లో లోకేష్ 2వేల 817 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుని పార్టీ శ్రేణులతో ఔరా అనిపించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరో 90 రోజుల్లో లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యానికి చేరుకోబోతుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాల మద్దతు కూడగట్టడం కోసం లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు. రెట్టించిన ఉత్సాహంతో లోకేష్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం నరసాపురం మండలం సీతారాంపురం నుంచి 207వ రోజు పాదయాత్రను కొనసాగిస్తున్న లోకేష్‌కు.. టీడీపీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. జనాలు, కార్యకర్తలు, అభిమానులు లోకేష్ పాదయాత్రలో హుషారుగా పాల్గొంటున్నారు. యువనేత లోకేశ్‌కు గుమ్మడి కాయలతో దిష్టి తీస్తూ, హారతులు పడుతూ, నీరాజనాలు పలుకుతున్నారు. జోరున వర్షం కురుస్తున్నా కూడా లోకేష్ తన పాదయాత్రను కొనసాగించారు. అవరోధాలు ఎదురైనా, అనేక చోట్ల కేసులు నమోదైనా వెనుకడుగు వెయ్యకుండా పాదయాత్రను కొనసాగించి తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రికార్డును నారా లోకేష్ బ్రేక్ చేశారు.