NARA LOKESH: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన కార్యకర్తలకు, కాపు సామాజిక వర్గానికి అదిరిపోయే షాక్ ఇచ్చారు టిడిపి జనరల్ సెక్రటరీ నారా లోకేష్. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మాత్రమే అవుతారని లోకేష్ తేల్చి చెప్పేశారు. జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తున్నందున ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని ప్రశ్నకు లోకేష్ తడుముకోకుండా.. “చాలా స్పష్టంగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి. దానిలో రెండో మాటే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే ముఖ్యమంత్రి కావాలని ఆయన కూడా అన్నారు.
Windows 10: విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా.. షాకింగ్ విషయం చెప్పిన మైక్రోసాఫ్ట్
కాబట్టి చంద్రబాబే ముఖ్యమంత్రి” అన్నాడు. లోకేష్ మాటలపై తెలుగుదేశంలోనూ, మిగిలిన రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చే జరుగుతుంది. ప్రధానంగా జనసేనలో ఒక వర్గం లోకేష్ మాటలపై మండిపడుతోంది. ఇదే ప్రశ్న కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్‌ని అడిగితే.. “ముఖ్యమంత్రి ఎవరు అన్నది నేను, చంద్రబాబు నాయుడు కలిసి, మాట్లాడుకుని నిర్ణయించుకుంటాం. అప్పుడు ప్రకటిస్తాం” అని పవన్ కళ్యాణ్ సవినయంగా చెప్పారు. కానీ లోకేష్ మాత్రం ఏకపక్షంగా చంద్రబాబు సీఎం అంటూ ఎలా ప్రకటిస్తారని జన సైనికులు మండిపడుతున్నారు. అంటే జనసేన-టిడిపి కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ మాటల ప్రకారం మరో పదేళ్లు ఈ రెండు పార్టీల పొత్తులో ఉంటే చంద్రబాబు అప్పటికీ సీఎంగానే ఉంటారు. అంటే చంద్రబాబును గెలిపించడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి మాత్రమే జనసేన పనిచేయాలి. అసలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడు సబ్జెక్టు కాదు కదా. భాగస్వామ్య పక్షంతో మాట్లాడి నిర్ణయించాలి గానీ.. లోకేష్ ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? అని జన సైనికులు వాదిస్తున్నారు. ఇక కాపు సామాజిక వర్గం కూడా లోకేష్ మాటలపై మండిపడుతోంది.
Traffic Challans: పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 90 శాతం డిస్కౌంట్
కాపులు.. టీడీపీ పల్లకీ మోసే బోయలు మాత్రమేనా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవం గుర్తించాలని, ఆయన్ని కరివేపాకులాగా వాడుకొని టీడీపీ, కమ్మ సామాజిక వర్గాలు వదిలేస్తాయని.. పొత్తు ధర్మాన్ని కూడా గుర్తించకుండా నేరుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఎలా ప్రకటిస్తారని కాపు సామాజిక నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానప్పుడు కాపులు.. టిడిపికి ఎందుకు ఓటు వెయ్యాలి అనేది వాళ్ళ ప్రశ్న. కనీస మర్యాద కూడా లేకుండా, పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం మున్ముందు టీడీపీ పొడవబోతున్న వెన్నుపోటుకు సంకేతమని కాపు నేతలు భావిస్తున్నారు. టీడీపీలో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోకేష్ ఓవరాక్షన్, నోటి దూల చాలా సందర్భాల్లో పార్టీకి నష్టం చేశాయని, ఇప్పుడు అనవసరంగా చంద్రబాబు సీఎం అని కాపు సామాజిక వర్గంతో దూరం పెంచాడనీ టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన అనవసరం.. మీడియా అడిగినప్పుడు తెలివిగా తప్పించుకోకుండా.. చంద్రబాబు సీఎం అని చెప్పిన లోకేష్ వల్ల కాపులు దూరమవుతారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.