PAWAN KALYAN: అయ్యో పవన్ ! డిప్యూటీగా కూడా పనికిరాడా..? జనసేనాని పరువు తీస్తున్న లోకేష్

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా జగన్‌ను అధికారం నుంచి దింపాలన్న లక్ష్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు జనసేనాని పవన్‌కు గత కొన్ని రోజులుగా ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 06:06 PM IST

PAWAN KALYAN: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకొని పవన్ కల్యాణ్ తప్పు చేశాడా..? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనాని చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అవుతోందా..? టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేశ్ వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పవన్ గాలి తీస్తుండటం జనసేన కార్యకర్తలు, కాపులకు అస్సలు నచ్చడం లేదు. తమ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అవుతాడని చెప్పాడు లోకేష్. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్‌కి డిప్యూటీ సీఎం ఇస్తారా అని అడిగితే.. అది చంద్రబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో కలిసి నిర్ణయిస్తుందట. అంటే టీడీపీ దయాదాక్షిణ్యాల మీద పవన్ ఆధారపడుతున్నారా అని జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు.

Vijayashanthi: రాములమ్మ పంచ్‌.. కేసీఆర్‌ను ఆడుకున్న రాములమ్మ..

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా జగన్‌ను అధికారం నుంచి దింపాలన్న లక్ష్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు జనసేనాని పవన్‌కు గత కొన్ని రోజులుగా ఊహించని అవమానాలు ఎదురవుతున్నాయి. అవసరమైనప్పుడు వాడుకొని, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబుకి అలవాటని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ విషయంలోనూ అలాగే చేస్తాడని జనసేన కార్యకర్తలతో పాటు కాపులు కూడా ఎప్పటినుంచో అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధికారానికి పవన్ పావులాగా ఉపయోగపడుతున్నాడనీ.. లోకేష్ చేస్తున్న కామెంట్స్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారని ఓ ఇంటర్వ్యూలో లోకేష్‌ని ప్రశ్నించారు. చంద్రబాబే ముఖ్యమంత్రి.. అంతటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి సీఎంగా ఉండాలని పవన్ కూడా అభిప్రాయపడ్డారని చెప్పుకొచ్చాడు. కూటమి అధికారంలోకి వస్తే.. రెండు పార్టీలకు చెరిసగం యేళ్ళు ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉంటుంది కదా.. కానీ బాబు ఒక్కడే ఐదేళ్ళు ఎలా కొనసాగుతాడు.. లోకేష్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడని జనసైనికులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా పెట్టడంపై తాము ఆలోచిస్తామని లోకేష్ మరో ఇంటర్వ్యూలో మాట్లాడటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

డిప్యూటీ సీఎంగా పవన్‌ని పెడతారా అంటే అది చంద్రబాబు.. టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయిస్తామని లోకేష్ చెప్పాడు. అంటే జనసేన ఓట్లతో గెలిచి అధికారం చేపడితే.. పవన్‌కి పదవి ఇవ్వాలా.. వద్దా అన్నది టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుందా..? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేం ఆధారపడాలా..? మా నాయకుడికి విలువ లేకుండా చేస్తారా అని పవన్ అభిమానులతో పాటు కాపులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ టీడీపీ పల్లకి మోయడం తప్ప మరో మార్గం లేని స్థాయికి జనసేనను తీసుకొచ్చాడని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య హెచ్చరికలను కూడా పవన్ పట్టించుకోకపోవడం, కనీసం స్టేట్‌మెంట్ అయినా ఇవ్వకపోవడం కాపులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. సీట్లపై పొత్తులతో ఇప్పటికే జనసేన లీడర్లకు చాలా నియోజకవర్గాల్లో అన్యాయం జరుగుతోంది. కనీసం రేపు అధికారంలోకి వస్తే మంచి పదవులైనా వస్తాయా.. లేకపోతే తాము చేసిన త్యాగాలు వృధా అవుతాయా అని ఆక్రోశంగా ఉన్నారు జనసేన నేతలు.