TDP-JANASENA: లోకేష్ ఓవర్ యాక్షన్.. లూజ్ టాక్.. టీడీపీ-జనసేన బంధానికి ఎసరు..?

రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఎవరికైనా టిడిపి-జనసేన బంధం నిలబడుతుందా అనే డౌట్ రాక మానదు. లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జనసేనలోనూ, కాపుల్లోనూ తీవ్ర అసహనం సృష్టించింది.

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 07:04 PM IST

TDP-JANASENA: టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఓవరాక్షన్.. బిల్డప్.. జనసేన, టిడిపి బంధానికి ఎసరు పెట్టేట్లుంది. రిపబ్లిక్ డే రోజు పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఎవరికైనా టిడిపి-జనసేన బంధం నిలబడుతుందా అనే డౌట్ రాక మానదు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం జనసేనలోనూ, కాపుల్లోనూ తీవ్ర అసహనం సృష్టించింది. రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి. ఇంకా సీట్లే ఖరారు కాలేదు. ఎన్నికలు జరగలేదు. ఫలితాలు రాలేదు. ప్రభుత్వం ఏర్పడలేదు. లోకేష్ అలా ఏకపక్షంగా చంద్రబాబు సీఎం అవుతాడు అంటూ లూస్ టాక్ చేసి తన అహంకారాన్ని బయట పెట్టుకోవడమే కాకుండా రెండు పార్టీల్లోనూ కొత్త టెన్షన్ సృష్టించాడు.

PAWAN KALYAN: ఆ రెండు సీట్లే ఎందుకు..? గెలుపు ఖాయమా..? పవన్ అందుకే ప్రకటించాడా..?

ఇదే ప్రశ్న మీడియా వాళ్ళు అంతకుముందు ఒక ప్రెస్‌మీట్‌లో పవన్ కళ్యాణ్‌ని అడిగితే.. తాను, చంద్రబాబు ఇద్దరం కూర్చుని చర్చిస్తామని చాలా మర్యాదగా చెప్పారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేని లోకేష్.. తన మనసులో మాటను బయటకు కక్కేశాడు. పొత్తు ధర్మాన్ని కాలరాయడం అంటే ఇదే. అపరిపక్వత ఉట్టిపడే లోకేష్‌లో తరచూ ఆయన మాటలు చంద్రబాబుకి తలనొప్పులు తెచ్చి పెడుతూనే ఉన్నాయి. అంతేకాదు పార్టీలో లోకేష్ టీమ్‌గా ముద్ర పడిన కొందరు, జనసేన విషయంలో చేస్తున్న కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్‌కి చేరుతున్నాయి. ఇప్పుడు స్టేట్‌లో టిడిపి వేవ్ నడుస్తోందని, అసలు జనసేనతో పొత్తులే అవసరం లేదని, కమ్మ సామాజిక వర్గంలో కొందరు అంటున్నారు. ముఖ్యంగా లోకేష్ అనుచరులు ఓపెన్‌గానే దీనిపై కామెంట్ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడగడాన్ని ఎద్దేవా చేస్తూ.. పొత్తులే లేకపోతే పవన్ కళ్యాణ్‌కు ఒక్క సీటు కూడా గెలవడని తెలుగుదేశంలో లోకేష్ అనుచరులు కామెంట్ చేయడం జనసేన నాయకుల్లో ఆగ్రహం కలిగిస్తుంది.

Thalapathy Vijay: చిరు, పవన్ దారిలోనే దళపతి విజయ్ ?

లోకేష్ వ్యవహార శైలిపై మొదటినుంచి జనసేన నాయకుల్లోనూ, ముఖ్యంగా కాపుల్లో బలమైన అనుమానం ఉంది. ఏరు దాటాక తెప్ప తగలేసే పద్ధతి టిడిపి మొదటి నుంచి అనుసరిస్తుంది. లోకేష్ తీరు చూస్తే ఏరు దాటకముందే తెప్ప తగలేసేటట్లు ఉన్నాడు. జనసేన.. టిడిపిపై ఆధారపడి మనుగడ సాగిస్తోందని, టిడిపి చెప్పినట్లు జనసేన వినాల్సిందేనని ఆఫ్ ద రికార్డు లోకేష్ తన సహచరులతో అన్నట్లు సమాచారం. దీనికి తోడు జనసేన ఆగ్రనేత నాదెండ్ల మనోహర్ టిడిపి నాయకుడిలా మాట్లాడడం కూడా జనసేన క్యాడర్లో చాలా అనుమానాలు వస్తున్నాయి. జనసేనకు 20 కన్నా ఎక్కువ సీట్లు ఇస్తే నష్టపోతామని, జేఎస్పీకి అంత సీన్ లేదని టిడిపి నేతలు ఓపెన్‌గానే కామెంట్ చేయడం జనసేనలో కొంత ఆవేదన కూడా కలిగిస్తోంది. నిజానికి జనసేన ఓటు శాతం ఐదు నుంచి 12కు పెరిగింది. అంతేకాదు.. కనీసం ఆంధ్రప్రదేశ్లో 80 నియోజకవర్గాల్లో జనసేన గెలుపోటములను నిర్ణయించగలుగుతుంది. కొందరు విశ్లేషకులు చెప్పినట్లు జనసేన కూరలో ఉప్పు లాంటిది. ఉప్పు విడిగా పనికిరాదేమో గాని అది వేస్తేనే కూర రుచిగా ఉంటుంది.

ఇవన్నీ మరిచిపోయి లోకేష్, ఆయన బృందం వేస్తున్న అతివేషాలు పవన్ కళ్యాణ్‌కు ఆవేదన కలిగిస్తున్నాయి. అందుకే రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో కాస్త మెత్తగానే టిడిపికి గడ్డి పెట్టాడు. అయితే లోకేష్ అహంకార ధోరణి ముందు ఇవన్నీ పని చేస్తాయా అన్నది డౌటే. జగన్ అరాచకం కన్నా లోకేష్ మోసపూరిత వ్యవహార శైలి ప్రమాదకరమైందని కొందరు జనసేన నాయకులు అంటున్నారు. ఎన్నికల తర్వాత టిడిపికి సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ వస్తే లోకేష్ ఓవర్ యాక్షన్‌కు అంతు ఉండదని జన సైనికులు అనుమానిస్తున్నారు. అందుకే రెండున్నర ఏళ్ల సీఎం, 40 ఎమ్మెల్యే సీట్లు కచ్చితంగా అడిగి తీసుకోవాల్సిందేనని పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు జనసేన నాయకులు.