టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవవగళం పాదయాత్ర 160 రోజులుగా సాగుతోంది. రాయలసీమలో యాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్.. కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించారు. నెల్లూరు అనంతరం ప్రకాశం జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి మంచి జోష్ తీసుకొచ్చిందని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. యాత్రను పర్యవేక్షిస్తున్న షోటైమ్ కన్సల్టెన్సీ కూడా లోకేశ్ పాదయాత్రకు మైలేజ్ తీసుకొచ్చేందుకు ఎంతో ప్రయత్నిస్తోంది. నిత్యం జనంలోకి తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తోంది. అయినా యాత్రకు రావాల్సినంత క్రేజ్ రావట్లేదని తెలుస్తోంది. నారా లోకేశ్ ఎంతో పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మారారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నా లోపల మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
నారా లోకేశ్ పాదయాత్రను గమనిస్తే వివిధ వర్గాలతో ఆయన మమేకం అయ్యేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. స్థానికంగా బలంగా ఉన్న సమాజిక వర్గాలతో మమేకం అయ్యేందుకు రచ్చబండ లాంటి కార్యక్రమాలూ చేపడుతున్నారు. ఇన్ హౌస్ మీటింగ్స్ కాకుండా పబ్లిక్ మీటింగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ బాగా గమనిస్తే లోకేశ్ స్పీచ్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న ప్రసంగాలే అని కొంతమందికి మాత్రమే తెలుసు. అంతేకాక తలపండిన రాజకీయ నేతలా చేస్తున్న ప్రసంగాలు కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వయసుకు తగ్గట్టు మాట్లాడితే పర్లేదు కానీ అలా బడాయి మాటలు మాట్లాడితే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. తన చుట్టూ ఉన్న వాళ్లని సంతృప్తి పరచవచ్చేమో కానీ ఒరిజినల్ నేతలకు ఇలాంటివి రుచించవు.
2019 ఎన్నికల్లో లోకేశ్ అన్నీ తానై వ్యవహరించారు. అన్నీ తనకు తెలుసన్నట్టు బిహేవ్ చేశారు. సీనియర్లకు సైతం సలహాలు ఇచ్చారు. వాటిని తు.చ.తప్పకుండా పాటించాలని ఆదేశించారు. అలా చేయడం వల్లే పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. డబ్బు కూడా సరిగా పంచకుండా లోకేశ్ అడ్డుకున్నారు. తాము గెలిచేస్తున్నామనే అతి నమ్మకమే అప్పుడు కొంప ముంచింది. గ్రౌండ్ రియాల్టి అర్థం చేసుకోకుండా లోకేశ్ అండ్ కో చేసిన ఓవరాక్షన్ వల్లే పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పుడు కూడా లోకేశ్ బిహేవియర్ అలాగే ఉందంటున్నారు కొంతమంది నేతలు. లోకేశ్ ఇప్పుడు పప్పు కాదని చెప్తున్నా.. ఆయన పనితీరు మాత్రం అలాగే ఉంది. ఇప్పటికైనా నేతలను, కేడర్ ను కలుపుకుపోయేందుకు లోకేశ్ ప్రయత్నించాలి. నేతలకు ఆదేశాలివ్వడం మానుకోవాలి. సీనియర్లకు సలహాలివ్వడం మానేసి వాళ్లు చెప్పింది వినాలి. పార్టీ హైకమాండ్ నుంచి నేతలు ఏం కోరుకుంటున్నారో అది తీర్చాలి. లేకుంటే మరోసారి పార్టీ ఓడిపోవడం ఖాయం.