పాపులేషన్ పరంగా కర్ణాటకలో లింగాయత్‌ల తరువాత ఉన్న పెద్ద కమ్యూనిటీ వొక్కలిగాస్. దాదాపు 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలు, 10 నుంచి 15 లోక్ సభ స్థానాల్లో ఈ వొక్కలిగాస్ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. మెయిన్‌గా 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. మొత్తం కర్ణాటక జనాభాలో 15 నుంచి 17 శాతం ఉంటుంది ఈ కమ్యూనిటీ. కన్నడ రాజకీయాల్లో వన్ ఆఫ్ ది డామినేటింగ్ కమ్యూనిటీ వొక్కలిగా. ముఖ్యంగా సౌత్ కర్ణాటక, మాండ్య, హాసన్, మైసూరు, బెంగళూరు రూరల్, తుమ్కూరు, కోలార్, చిక్కబల్లాపూర్, చికమగలూర్‌లో వీళ్ల ఓట్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్. చిత్రదుర్గ, షిమోగా, దక్షిణ కన్నడ, ఉడిపి ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వీళ్ల కమ్యూనిటీ ఉంది. చాలా కాలంగా ఈ వొక్కలిగాస్ జేడీఎస్‌కు ట్రెడిషనల్ సపోర్టర్స్. సింపుల్‌గా చెప్పాలంటే వీళ్లే జేడీఎస్ బలం. వీళ్ల సపోర్ట్‌తోనే ప్రతీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్‌గా ఉంటూ వచ్చింది.
సాధారణంగానే నేషనల్ పార్టీస్‌తో కంపేర్ చేస్తే లోకల్ పార్టీస్‌కు బలం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇలాంటి కమ్యూనిటీ వెంటే ఉంటే ఆ బలం వేరే లెవెల్. 2018 ఎన్నికల్లో వొక్కలిగాస్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న 14 స్థానాల్లో 13 స్థానాలు సొంతం చేసుకుంది జేడీఎస్. లోకల్‌లో కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే జేడీఎస్ పరిమితం. ఆ కొన్ని ప్రాంతాలు కూడా వొక్కలిగాస్ డామినేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలే. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఈ కమ్యూనిటీ జేడీఎస్‌కు హ్యాండి ఇచ్చినట్టు అనిపిస్తోంది. వీళ్ల సపోర్ట్‌తో 2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలిచింది జేడీఎస్. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కేవలం 20 స్థానాలకు పడిపోయింది. అంటే 17 స్థానాలు కోల్పోయింది. ఈ నంబర్ ఇంకా పెరుగుతోంది కూడా. వొక్కలిగాస్ ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా జేడీఎస్ ఓడిపోయింది. అంటే ఈ కమ్యూనిటీ జేడీఎస్‌కు గుడ్ బై చెప్పింది అనేది మాత్రం క్లియర్.
ఈ ఇష్యూ ఇప్పుడు మొదలైంది కాదు. చాలా కాలం నుంచి వొక్కలిగాస్ కమ్యూనిటీ జేడీఎస్ మీద అసంతృప్తిగా ఉంది. ఎన్నికల ముందు జరిగిన చాలా మీటింగ్స్‌కు కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్‌ను ఇన్వైట్ చేశారు వొక్కలిగాస్ లీడర్స్. వీళ్ల ప్రధాన డిమాండ్.. వాళ్లకున్న రిజర్వేషన్‌ను 12 శాతానికి పెంచడం. దీన్ని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకుంది. జేడీఎస్‌ను బ్లేమ్ చేయకుండా.. బీజేపీని కార్నర్ చేసింది. వొక్కలిగాస్‌కు రిజర్వేషన్ రాకుండా బీజేపీ కంట్రోల్ చేస్తుంది అన్న వాదనను వొక్కలిగాస్‌లో ప్రచారం చేసింది. జేడీఎస్ బీజేపీతో అలయన్స్‌లో ఉంది కాబట్టి వొక్కలిగాస్‌కు ఉన్న నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ మాత్రమే. శివకుమార్ స్ట్రాటజీ 100 శాతం పని చేసింది. కర్ర విరగకుండానే పాము చచ్చింది. వొక్కలిగాస్ ఓట్లు మొత్తం కాంగ్రెస్‌కు పడిపోయాయి.
దీనికి తోడు తమ కంట్రోల్ నుంచి వెళ్లిపోతున్న సపోర్టర్స్‌ను కాపాడుకోవడంలో జేడీఎస్ ఫెయిల్ ఐంది. అసలే కొన్ని స్థానాలకే పరిమితమైన జేడీఎస్.. ఇప్పుడు మరిన్ని స్థానాలు కోల్పోయింది. దీంతో ఇక కర్ణాటకలో జేడీఎస్ పని ఐపోయినట్టే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్యూచర్‌లో జేడీఎస్ మళ్లీ వొక్కలిగాస్ నమ్మకాన్ని కూడగట్టుకుంటుందా.. లేక పర్మనెంట్‌గా వాళ్లకు దూరం అవుతుందా చూడాలి.