అలా ఒడిస్సా ప్రజల గుండెల్లో నిలిచిన ఓ పవర్ ఆ రాష్ట్రీ సీఎం నవీన్ పట్నాయక్. రాజకీయ నాయకుడు అంటే ఓటర్లు నమ్మించాలి.. హామీల వర్షంలో ముంచెత్తి ఓట్లు గుద్దించుకోవాలని చూసే ఈ రోజుల్లో కూడా నవీన్ పట్నాయక్ క్లీన్ పాలిటిక్స్ సింప్లిసిటీ ఆయనను వందలో ఒకడిగా చేశాయి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే మాట నవీన్ పట్నాయక్‌కు సరిగ్గా సరిపోతుంది.
అభివృద్ధి పనులకు అడ్డుగా ఉందని తన తండ్రి సమాధినే తొలగించిన నిజాయితీగల నేత నవీన్ పట్నాయక్. పూరిలోని స్వర్గధామాన్ని అభివృద్ధి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగుణంగా అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. ఇంతలో నవీన్‌పట్నాయక్ తండ్రి బీజూబాబు సమాధి అడ్డుగా వచ్చింది. సీఎం తండ్రి సమాధి అవ్వడంతో దాన్ని పడగొట్టేందుకు అధికారులు వెనకాడారు. కానీ నవీన్ పట్నాయక్ మాత్రం వెంటనే సమాధిని తొలగించాలంటూ ఆదేశించారు.
ఇదొక్కటి చాలు ఆయన డెడికేషన్ ఏంటో చెప్పడానికి. జనరల్ తల్లిదండ్రులు పూర్వీకులు సమాధులంటే చాలా పవిత్రంగా చూస్తాం. సమాధిలో మనవాళ్లను చూసుకుంటూ కాపాడుకుంటాం. కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం తండ్రి సమాధిని కూడా లెక్క చేయలేదు నవీన్ పట్నాయక్. ఇదొక్కటే కాదు. ఇలాంటి రికార్డ్‌లు ఆయన జీవితంలో ఉన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి కాబట్టే ఆయనను ఒడిశా ప్రజలు నెత్తిమీద పెట్టుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ పెళ్లి చేసుకోలేదు. అతనికంటూ కుటుంబం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వారు ఏ వ్యవస్థలో వేలు పెట్టరు. కాబట్టి తనను ఎన్నుకున్న ప్రజలే ఆయనకు కుటుంబ సభ్యులు. ఆ దిశగానే ఆయన పాలన ఉంటుంది.
అప్పట్లో ఓ అనాథను చేరదీసి చదివించి పెద్ద పారిశ్రామికవేత్తను చేశాడు నవీన్ పట్నాయక్. ఒడిశాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించినప్పుడు ఆ యువ పారిశ్రామికవేత్త తాను ఏ విధంగా ఇంత ఎత్తుకు ఎదిగింది చెబుతుంటే నవీన్ పట్నాయక్ కన్నీరు కార్చాడు. ఈ సమ్మిట్ తరువాత ఒడిశా స్టేట్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. విద్యా, పరిశ్రమలకే కాదు. క్రీడలకు కూడా ఒడిశా ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుంది. ప్రతీ ఏటా నేషనల్ హాకీ గేమ్స్‌కు ఒడిశా స్టేట్ ఫండిగ్ ఇస్తుంది.
దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒకటి ఐనప్పటికీ జాతీయ క్రీడలకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇక రాజకీయం పరంగా కూడా నవీన్‌పట్నాయక్ స్టైల్ డిఫరెంట్. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోరు. ఏ పార్టీ పొత్తు కోరుకోరు. సింహం సింగిల్ అన్నట్టుగా ఎప్పుడూ ఎన్నికలకు సింగిల్‌గానే వెళ్తారు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం, లేదంటే ప్రతిపక్ష. కానీ పొత్తు పెట్టుకునే థాట్ కూడా నవీన్ పట్నాయక్‌కు ఉండదు. అంతే కాదు.. అధికారంలో ఉన్నాం కదా అని అనవసర ఆరోపణలు విమర్శలు చేయరు. అవసరానికి మించి మాట్లాడరు. సింపుల్‌గా చెప్పాలంటూ ఆయన వస్తే ప్రతిపక్ష నేతలు కూడా లేచి నిల్చుంటారు. ఇది అధికారంతోనో డబ్బుతోనే వచ్చే హోదా కాదు. ఇలాంటి వ్యక్తిత్వమే నవీన్ పట్నాయక్‌ను దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకడిగా చేసింది.