Naveen Yadav: బీజేపీలోకి నవీన్‌ యాదవ్‌! ట్విస్ట్ మాములుగా లేదుగా..

జూబ్లీహిల్స్ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంఐఎం నేత నవీన్ యాదవ్‌.. టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే నవీన్ యాదవ్‌కు బీజేపీ గాలం వేసినట్లుగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 05:06 PM IST

Naveen Yadav: ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయ్. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు జోరుగా సాగుతున్నాయ్. కాంగ్రెస్‌లోకే ఎక్కువగా చేరికలు కనిపిస్తున్నాయ్. ఐతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీ గేర్‌ మార్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల్లో దేనికదే ప్రత్యేకం. ఐతే హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ మాత్రం మరింత స్పెషల్‌. పొలిటికల్, సినిమా సెలబ్రిటీలు ఉండే ఏరియా ఇది. దీంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఆసక్తి సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని పక్కనపెట్టి.. భారత మాజీ క్రికెటర్‌ అజారుద్దిన్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్‌.

Janasena: జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి.. జనసేన ఆరోపణ..

బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ రంగంలోకి దిగారు. ఐతే ఈ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంఐఎం నేత నవీన్ యాదవ్‌.. టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. అయితే నవీన్ యాదవ్‌కు బీజేపీ గాలం వేసినట్లుగా తెలుస్తోంది. నవీన్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుందని తెలుస్తోంది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే పార్టీ గెలుపు కోసమే చర్చ జరిగిందని కిషన్‌ రెడ్డి పైకి చెప్తున్నా.. నవీన్ యాదవ్‌ను బీజేపీలోకి రావాలంటూ.. కమలం పార్టీ నుంచి ఆహ్వానం అందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్‌ యాదవ్‌కు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో మంచి పట్టుంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున బరిలో నిలిచిన నవీన్ కుమార్ యాదవ్ 41వేలకు పైగా ఓట్లు సాధించారు. 2018లో AIMIMకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు 18వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఈసారి మజ్లిస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన ఇండింపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. ఐతే నవీన్‌ యాదవ్‌ బీజేపీలో చేరితే.. జూబ్లిహిల్స్‌ రాజకీయం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.