2024 లోక్ సభ ఎన్నికల్లో (2024 Lok Sabha Elections) బంపర్ మెజారిటీతో బీజేపీ (BJP) ఆధ్వర్యంలోని NDA కూటమి విజయం సాధిస్తుందని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. గతంలో వచ్చిన సీట్లు గానీ… అంతకంటే ఎక్కువగా గానీ బీజేపీకి వస్తాయని చెప్పారు. మోడీ ఇమేజ్ బీజేపీకి కలిసి వస్తోందని చెప్పారు. అలాగే ప్రత్యర్థి కూటమి ఇండియాలో చీలికలు రావడం బీజేపీకి ప్లస్ అవుతోందని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో… లోక్ సభ ఎన్నికలకు ప్లస్ అవుతుందన్నాడు పీకే.
బిహార్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో లాలూ ప్రసాద్ (Lalu Prasad) ని, RJD ని నమ్మడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore). బీజేపీకే ఓట్లు వేస్తారని చెప్పారు. నితీష్ కుమార్ (Nitish Kumar) బీజేపీతో జతకట్టడం వల్ల లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీకి కలిసొస్తుంది. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీయూ విడిపోతాయని జోస్యం చెప్పారు ప్రశాంత్ కిషోర్. 2025 లో బిహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల లోపే రెండు పార్టీలు విడిపోతాయంటున్నారు. బిహార్ లో నితీష్ గ్రాఫ్ పడిపోయిందనీ… వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు మించి రావన్నారు ప్రశాంత్ కిషోర్. అంతకంటే ఎక్కువ వస్తే… తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.