PM Modi: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ (BJP) ప్రభుత్వమే ఏర్పడుతుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. “ఈ నేలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను.
ASSEMBLY ELECTIONS: నోరు జారింది! జర చూసి మాట్లాడండి! కేసీఆర్, కేటీఆర్ నోట ఓటమి మాట !!
నేను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యింది. ఈసారి ఇదే మైదానం నుంచి బీసీని సీఎం చేసేందుకు బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాతో పవన్ కల్యాణ్ ఉన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మార్పు తేవాలని నిర్ణయించారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి విరోధి ప్రభుత్వం ఉంది. బీసీ వ్యతిరేక ప్రభుత్వంను పీకి పారేయాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో నడిచే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బీసీలకు సీఎం అవకాశం ఇవ్వవు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ విషయంలో బీఆర్ఎస్ మోసం చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారు. తెలంగాణ వచ్చాక బీసీలను మోసం చేశారు. బీసీల ఆకాంక్షలను బీఆర్ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదు. తెలంగాణలో వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యువతను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్ వెళ్లిపోవాలా? వద్దా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న మాట గాలిమూటగా మారిపోయింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ నేతలు మాపై ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదు. అవినీతి చేసిన వారిని కచ్చితంగా జైలులో వేస్తాం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇక్కడి నేతలకు సంబంధం ఉంది. విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలను తిడుతున్నారు. జనాన్ని దోచుకున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సిదే. దేశంలో 365 మంది శాసనసభ్యులు, 65 మంది శాసనమండలి సభ్యులు బీజేపీ నుంచి ఉన్నారు. తెలంగాణలో కూడా బీసీలకు అనేక పదవులు ఇచ్చాం. అహంకారం ఎవరికి ఉన్నా వారిని ఓడించాలి. బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తుంది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.