టీడీపీ, జనసేన కలిస్తే.. వైసీపీకి గడ్డు పరిస్థితులు ఖాయం. అందుకే రెండు పార్టీలు వీలైనంత దూరం ఉంచేలా.. ఫ్యాన్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేనను టార్గెట్ చేసుకొని పదేదే ఒక సవాల్ చేస్తున్నారు. టీడీపీకి కానీ, జనసేనకు కానీ దమ్ముంటే.. 175స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలంటూ చాలెంజ్ విసురుతున్నారు. రెండు పార్టీలు విడిగా పోటీ చేయాలనేది వైసీపీ కాన్సెప్ట్. టీడీపీ, జనసేన విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి.. తమకు అనుకూలంగా పరిస్థితి మారుతుందన్నది వైసీపీ నేతల ఆలోచన. నిజానికి గత ఎన్నికల్లో జరిగింది అదే ! టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఇంకోలా ఉండేది సీన్. దీంతో టీడీపీ, జనసేనను దూరం చేయాలని ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తుంటే.. ఆ రెండు పార్టీలు కలిసి వైసీపీకి కొత్త సవాల్ విసురుతున్నాయ్.
2019లో జరిగిన తప్పు రిలీట్ కాకుండా.. రెండు పార్టీలు రెడీ అవుతున్నాయ్. ఇక దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలన్న వైసీపీ సవాల్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఆ సవాల్ రివర్స్ అయ్యేలా చేస్తోంది. జగన్‌కు దమ్ముంటే 151మంది ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తారా అంటూ టీడీపీ, జనసేన నేతలు కొత్త సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని… వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇచ్చే ఛాన్స్ లేదని జగన్ చెప్పేస్తున్నారు. అందరికీ సీట్లు ఇస్తే వైసీపీకే నష్టం. దీంతో టీడీపీ, జనసేన దీన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయ్. సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చే ధైర్యం లేనప్పుడు.. తాము ఎలా పోటీ చేయాలని చెప్పడం ఎందుకు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. నిజానికి వైసీపీ సిట్టింగ్‌ల్లో చాలామందిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గడపగడపకు కార్యక్రమంలో జనాలు నిలదీస్తున్నారు. దీంతో జగన్ నజర్ పెంచారు. చాలామందికి టికెట్‌లు నిరాకరించడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ, జనసేనకు ఆయుధంగా మారింది. కొత్త స్ట్రాటజీలకు నాందిపలికేలా చేస్తోంది.