CBN SURVEY : పీకే పీకిందేమీ లేదు.. బాబు గెలుపు వెనుక రాబిన్ శర్మ

ఆంధ్రప్రదేశ‌ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) సాధించిన విజయంపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో 91శాతం ఫలితాలు సాధించామని NDA సమావేశంలో చంద్రబాబు చెప్పారు.

ఆంధ్రప్రదేశ‌ (Andhra Pradesh) లో టీడీపీ (TDP) సాధించిన విజయంపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా ఏపీలో 91శాతం ఫలితాలు సాధించామని NDA సమావేశంలో చంద్రబాబు చెప్పారు. అటు ప్రధాని మోడీ కూడా ఈ విక్టరీ వెనుక పవన్ సునామీ కూడా ఉందన్నారు. అయితే టీడీపీ విజయం వెనుక ఉంది మాత్రం నూటికి నూరుపాళ్ళు వ్యూహకర్త రాబిన్ శర్మ (Robin Sharma). ఆయన సంస్థ షోటైమ్ కన్సల్టెంగ్ గత ఐదేళ్ళుగా టీడీపీ (TDP) విజయం కోసం కష్టపడింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చినా…ఆయన టీడీపీకి సలహాలేమీ ఇవ్వలేదట. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు.

ఏపీలో 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే గెలిచింది టీడీపీ. దాంతో పార్టీని గాడిలో పెట్టేందుకు షోటైమ్ కన్సల్టెంగ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు చంద్రబాబు. అప్పటి ఓటమి నుంచి బయటపడటానికి టీడీపీకి చాలా టైమ్ పట్టింది. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ టీడీపీకి వరుస ఓటములు ఎదురయ్యాయి. దాంతో షోటైమ్ సంస్థ ఓనర్ రాబిన్ శర్మ పనితీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సరిగ్గా మొన్నటి ఎన్నికలకు ముందు జగన్ వేసిన తప్పటడుగును టీడీపీకి విజయంగా మలిచారు రాబిన్ శర్మ. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉండటం… అదే టైమ్ లో పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం… ఆ తర్వాత NDA కూటమితో జతకట్టడం లాంటి పరిణామాలను క్యాష్ చేసుకుంటూ వ్యూహాలు రచించారు రాబిన్ శర్మ. సెంట్రల్ కమాండ్ కంట్రోల్, వార్ రూమ్స్ ఏర్పాటు చేసి టీడీపీ గెలుపు కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చి 200 మందికి పైగా సిబ్బందిని పెట్టుకున్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఆఫీస్ బేరర్లను నియమించారు.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ… వాటిని ఎప్పటికిప్పుడు వార్ రూమ్ కి అందిస్తూ అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తూ పనిచేశారు. గ్రౌండ్ లెవల్లో అన్ని నియోజవకర్గాల్లో టీడీపీ గెలుపు కోసం 14 వందల మందికి పైగా సిబ్బంది పనిచేసినట్టు షోటైమ్ కన్సల్టెంగ్ తెలిపింది. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా ప్రతి వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ పనిచేశారు. ఏపీలో ఉన్న 14 లక్షల మంది తటస్థ ఓటర్లను కూటమి వైపునకు తీసుకు రావడంలోనూ రాబిన్ శర్మ కీలకంగా వ్యవహరించారు. అసలు టీడీపీ విజయానికి కీ రోల్ పోషించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను జనంలో తీసుకెళ్ళింది రాబిన్ శర్మే. దర్శి ప్రజాగళం సభలో చంద్రబాబుతో ఆ చట్టం కాపీలను చించి వేయించడం లాంటి పనులు కూడా చేయించారు. అలాగే చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు కుటుంబ సభ్యులందర్నీ గ్రౌండ్ లెవల్లో క్యాంపెయిన్ కి పంపింది షోటైమ్ కన్సల్టెంగ్ సంస్థ.

యువగళం, ప్రజాగళం, నిజం గెలవాలి లాంటి పేర్లు కూడా పెట్టింది. చంద్రబాబు ఒకానొక దశలో ప్రశాంత్ కిషోర్ ని కన్సల్ట్ చేసినా… ఆయన ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూల్లో టీడీపీ, కూటమికి అనుకూలంగా ప్రకటనలు చేశారే తప్ప… నేరుగా టీడీపీకి ఎలాంటి రాజకీయ వ్యూహాలను అందించలేదు. అయినా పీకీ పని అయిపోయింది. ఇప్పుడాయన పెద్దగా పీకేదేమీ లేదన్న కామెంట్స్ టీడీపీ నుంచి కూడా వినిపించాయి. మొదట్లో అంతగా నమ్మకపోయినా చివరకు తమ విజయం వెనుక రాబిన్ శర్మ ఉన్నారని టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నాయి.