ఐఏఎస్, ఐపిఎస్ లు లకు రంకు మొగుడయ్యాడు, మొన్న కడప ఎస్పీ, నిన్న కాకినాడ ఎస్పీ, నేడు కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఇప్పుడు అధికారులు వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏ అధికారిని టార్గెట్ చేస్తారో అనే భయం చివరకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో కూడా ఉండటంతో ఇప్పుడు అధికారుల్లో తెలియని భయం కనబడుతోంది.

  • Written By:
  • Publish Date - December 12, 2024 / 12:03 PM IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఇప్పుడు అధికారులు వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏ అధికారిని టార్గెట్ చేస్తారో అనే భయం చివరకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో కూడా ఉండటంతో ఇప్పుడు అధికారుల్లో తెలియని భయం కనబడుతోంది. అటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అలాగే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. అలాగే జనసేన పార్టీ మంత్రులు నిర్వహిస్తున్న శాఖలపై కూడా పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఉన్నారు.

నాదెండ్ల మనోహర్ అలాగే కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న శాఖలలో ఉన్నటువంటి కీలక అధికారులపై పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ అధికారుల విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఆయన కాకినాడ పర్యటన చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ పర్యటన సందర్భంగా పౌరసరఫరాల శాఖ అధికారులు అలాగే కాకినాడ ఎస్పీ జిల్లా కలెక్టర్ పై ఆయన సీరియస్ అయ్యారు. ఏకంగా తన పర్యటన ఉన్న సమయంలో కాకినాడ ఎస్పి సెలవు తీసుకోవడం పట్ల ఉపముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చ జరిగింది. ఇక ఇప్పుడు కాకినాడ కలెక్టర్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్రమ రేషన్ బియ్యం రవాణా విషయంలో కలెక్టర్ సీరియస్ గా ఫోకస్ చేయడం లేదని కేవలం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండటంతోనే ఆయన అక్రమ రేషన్ బియ్యం దందా పై సీరియస్ అయ్యారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపద్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు ముందు చంద్రబాబు వద్ద పలు కీలక అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టు తెలుస్తుంది.

ఇక కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా అధికారులు తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. స్వయంగా నాదెండ్ల మనోహర్ పర్యటన చేసిన సరే అక్రమ రేషన్ బియ్యం దందా ఆగటం లేదంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పౌరసరఫరాల శాఖలో మంత్రి కంటే అధికారులదే కీలకపాత్ర ఉంటుంది. మంత్రి బాధ్యత చాలా తక్కువ కాబట్టి అధికారులు చాలా సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ శాఖపై కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు.

అందుకే నాదెండ్ల మనోహర్ కూడా ఎప్పటికప్పుడు పర్యటనలు చేస్తున్నారని, తాజాగా విశాఖపట్నం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారని సమాచారం. విదేశాలకు తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుకోవడాన్ని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఇక కలెక్టర్లు మాత్రమె కాకుండా ఐపీఎస్ అధికారులపై కూడా పవన్ కళ్యాణ్ గుర్రుగానే ఉన్నారు. హోం శాఖలో కొంతమంది కీలక అధికారులపై కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.

నెల రోజుల కిందట కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు పై పవన్ కళ్యాణ్ సాక్షాలతో సహా చంద్రబాబు నాయుడు వద్ద ఫిర్యాదు చేయడంతో ఆయనను బదిలీ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రవీందర్ రెడ్డి అరెస్టు తర్వాత ఎస్పీ అలసత్వంగా వ్యవహరించారని, 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనితో ఆ తర్వాత ఎస్పీని చంద్రబాబు బదిలీ చేశారు. అదే సమయంలో సిఐని సస్పెండ్ చేశారు. మరికొందరు అధికారులు పై కూడా వేటు పడింది. దీనితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు వింటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో పాటుగా క్షేత్రస్థాయి అధికారులకు కూడా భయం మొదలైంది.

గతంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో గోక్కోవాలంటే కొంతమంది రాజకీయ నాయకులు భయపడిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా జరుగుతోంది. ఆయన ఎప్పుడు ఏ శాఖపై మాట్లాడుతారో అనే ఆందోళన కూడా అటు అధికారులలో ఇటు ఇతర శాఖల మంత్రులలో కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫిర్యాదులను సీరియస్ గా తీసుకోవడంతో అధికారులు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. త్వరలోనే మరోసారి పవన్ కాకినాడ వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.