Naveen Patnaik: జ్యోతిబసును దాటిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. అత్యధిక కాలం సీఎంగా ఉన్న రెండో వ్యక్తిగా రికార్డు

పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతిబసు 23 సంవత్సరాల 139 రోజులపాటు సీఎంగా ఉంటే, నవీన్ పట్నాయక్ శనివారం నాటికి ఆ రికార్డును సమం చేశారు. ఆదివారం నాటికి దీన్ని అధిగమించి, 23 సంవత్సరాల 140 రోజులపాటు సీఎంగా కొనసాగి, అత్యధిక కాలం సీఎంగా ఉన్నరెండో వ్యక్తిగా నిలిచారు.

  • Written By:
  • Publish Date - July 23, 2023 / 10:24 AM IST

Naveen Patnaik: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించారు. దేశంలో అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇంతకముందు జ్యోతిబసు పేరుతో ఉన్న ఈ రికార్డును నవీన్ పట్నాయన్ అధిగమించారు. పశ్చిమ బెంగాల్ సీఎంగా జ్యోతిబసు 23 సంవత్సరాల 139 రోజులపాటు సీఎంగా ఉంటే, నవీన్ పట్నాయక్ శనివారం నాటికి ఆ రికార్డును సమం చేశారు. ఆదివారం నాటికి దీన్ని అధిగమించి, 23 సంవత్సరాల 140 రోజులపాటు సీఎంగా కొనసాగి, అత్యధిక కాలం సీఎంగా ఉన్నరెండో వ్యక్తిగా నిలిచారు నవీన్ పట్నాయక్. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కాలం సీఎంగా పని చేసింది పవన్ కుమార్ చామ్లింగ్. ఆయన సిక్కిం ముఖ్యమంత్రిగా 24 సంవత్సరాల 166 రోజులపాటు పని చేశారు. నవీన్ పట్నాయక్ ఈ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంది. ఇప్పటికీ నవీన్ పట్నాయక్ సీఎంగా కొనసాగుతున్నారు. మరో 13 నెలలు సీఎంగా కొనసాగితే నవీన్ అత్యధిక కాలం సీఎంగా పని చేసిన వ్యక్తిగా నిలుస్తారు. ఇంకా నవీన పట్నాయక్ పదవిలోనే ఉన్నందున ఈ రికార్డు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, వచ్చే ఏడాది ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో కూడా గెలిచి, సీఎంగా ఎన్నికైతే నవీన్ పట్నాయక్ ఈ ఘనత సాధించే వీలుంది.
ఇవీ నవీన్ ప్రత్యేకతలు
ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ తనయుడైన నవీన్ పట్నాయక్ 1990ల నుంచి రాజకీయాల్లో రాణిస్తున్నారు. బిజూజనతా దళ్ (బీజేడీ) పార్టీని ఏర్పాటు చేసి, కేంద్ర మంత్రిగానూ పని చేశారు. ఆ తర్వాత 2000లో బీజేడీని అధికారంలోకి తెచ్చి, తొలిసారి ఒడిశా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2000 నుంచి ఇప్పటివరకు వరుసగా ఐదుసార్లు ఒడిశాలో బీజేడీనే అధికారంలోకి వచ్చింది. వరుసగా ఐదుసార్లు అటు ఎమ్మెల్యేగా, ఇటు సీఎంగా నవీన్ ఎన్నికవుతూనే ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ గెలిచి, ఐదుసార్లు సీఎం పదవి చేపట్టి, 23 ఏళ్ల 140 రోజుల నుంచి పదవిలో ఉన్నారు. గతంలో బీజేపీ, ఆ తర్వాత ఎన్సీపీ, కమ్యూనిస్టుల సహకారంతో ఎన్నికల్లో గెలిచి, పదవి చేపట్టారు. 2014, 2019 ఎన్నికల్లో మాత్రం సొంతంగానే పార్టీని విజయపథంలో నడిపించారు. 2024లో జరగబోయే ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకం. ఈ ఎన్నికల్లో గెలిస్తే వరుసగా ఆరుసార్లు సీఎంగా గెలిచిన వ్యక్తిగా నిలుస్తారు. అత్యధిక కాలం సీఎంగా పనిచేసి నేతగా కూడా ఘనత దక్కించుకుంటారు. ఇంతకాలం నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించలేకపోయారు. ఇంకా ఒడిశా వెనుకబడిన రాష్ట్రంగానే ఉంది.