విజయవాడలో వరద బాధితులకు పూర్తి స్థాయిలో ఆహారం, వసతి అందే వరకు ప్రభుత్వం కష్టపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. నేడు ఆయన అధికారులతో వరద బాధితులకు సహాయ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్ టీ ఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వెళ్ళలేని ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఆహారం ఇచ్చే ఏర్పాట్లు చేశాం అని అన్నారు.
హెలికాప్టర్ లు, బుల్డోజర్ లు, ప్రోక్లైనర్స్ తో కూడా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాం అన్నారు. సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, మంత్రులు అంతా సహాయక చర్యల్లో ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ఎవరూ అలక్ష్యం చేయొద్దు అని హెచ్చరించారు. ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తా అన్నారు చంద్రబాబు. డబ్బులు అసలు సమస్యే కాదు, ఎంత డబ్బులు ఖర్చయినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు చంద్రబాబు.
ప్రజలు కూడా కాస్త ఓపిక పట్టండి, ఆలస్యం అయితే అరగంట అవుతుంది, అన్నీ సేవలు అందరికీ అందుతాయని… ఒక అధికారి అలసత్వం వహిస్తే సస్పెండ్ చేసాను అని పేర్కొన్నారు చంద్రబాబు. మంత్రులను కూడా వదలను, బాధ్యత గా వ్యవహరించకపోతే చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.